World Press Photo Contest
-
చిన్నారి శరణార్థి
అమెరికా–మెక్సికో సరిహద్దులో ఫొటోగ్రాఫర్ జాన్ మూరే తీసిన ఈ ఫొటో ప్రతిష్టాత్మక ‘వరల్డ్ ప్రెస్ ఫొటో స్టోరీ ఆఫ్ ది ఇయర్’ అవార్డును గెలుచుకుంది. హోండురస్కు చెందిన శాండ్రా, తన రెండేళ్ల కూతురు యనేలాతో కలిసి 2018 జూన్ 12న అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తుండగా బోర్డర్ అధికారులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా తల్లిని తనిఖీ చేస్తుండగా చిన్నారి యనేలా భయంతో ఏడ్వడం మొదలుపెట్టింది. ఈ ఫొటో వైరల్ కావడంతో అక్రమవలసదారుల పిల్లలను తల్లిదండ్రుల నుంచి వేరుచేసే నిబంధనన అధ్యక్షుడు ట్రంప్ రద్దుచేయాల్సి వచ్చింది. -
ప్రపంచ ఉత్తమ ఫొటోలు
-
బెస్ట్ ఫొటోస్ ఆఫ్ ది ఇయర్
ఆమ్స్టర్డామ్: ఏటా నిర్వహించే వరల్డ్ ప్రెస్ ఫొటో కాంటెస్ట్ ఫలితాలు నెదర్లాండ్ రాజధాని ఆమ్స్టర్డామ్ లో గురువారం అర్థరాత్రి విడుదలచేశారు నిర్వాహకులు. ప్రపంచ నలుమూలలా చోటుచేసుకున్న వివిధ సందర్భాల్లో 5,775 మంది ఫొటోగ్రాఫర్లు చిత్రీకరించిన 82,951 ఫొటోలు పోటీకి అర్హత సాధించాయి. వాటన్నింటిలోకి సిరియన్ల వలస కష్టాలపై చిత్రించిన ఛాయాచిత్రానికి 2015 ఏడాదికిగానూ మొదటి బహుమతి దక్కింది. హంగరీ- సెర్బియా సరిహద్దు వద్ద చంటిపిల్లాడితో కంచె దాటుతున్న కుటుంబం ఫొటోను ఆస్ట్రేలియాకు చెందిన వారెన్ రిచర్డ్ సన్ తీశారు. మొత్తం128 విభాగాల్లో ఉత్తమ ఫొటోలను ఎంపికచేశారు. వాటిలో కొన్ని ఇవి.. మరిన్ని చిత్రాల కోసం..