జుట్టుపట్టి ఈడ్చుకొచ్చి బ్రిడ్జి పైనుంచి తోసేసింది | Woman thrashes husband's lover, throws her off bridge | Sakshi
Sakshi News home page

జుట్టుపట్టి ఈడ్చుకొచ్చి బ్రిడ్జి పైనుంచి తోసేసింది

Published Mon, Jan 18 2016 12:22 PM | Last Updated on Sun, Sep 3 2017 3:51 PM

జుట్టుపట్టి ఈడ్చుకొచ్చి బ్రిడ్జి పైనుంచి తోసేసింది

జుట్టుపట్టి ఈడ్చుకొచ్చి బ్రిడ్జి పైనుంచి తోసేసింది

రియో డి జానిరో: దిగ్భ్రాంతికర వీడియో ఒకటి సోషల్ మీడియాలో నెటిజన్లను షాక్కు గురి చేసింది. భర్త  ప్రియురాల్ని రెడ్ హ్యాండెడ్ గా దొరకబుచ్చుకుని 10 అడుగుల వంతెనపై నుంచి తోసేసిన ఈ వీడియో క్షణాల్లో వైరల్ అయింది. తన భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళపై  పట్టపగలు  దారుణంగా దాడిచేసి, హింసించిన ఘటన బ్రెజిల్లో చోటు చేసుకుంది.

తన భర్తతో సన్నిహితంగా ఉండడాన్ని గమనించిన ఆమె ఆగ్రహానికి లోనైంది. సదరు మహిళపై పదేపదే దాడి చేసింది. జుట్టుపట్టి లాగి పిడిగుద్దులు కురిపించింది.  క్షమించమంటూ మొరపెట్టుకున్నా కనికరించలేదు. బాధిత మహిళ  గేటుపట్టుకొని పెనుగులాడి, వదిలేయమని అరిచి గీపెట్టింది. అయినా ఆమె ఆగ్రహం చల్లారలేదు. ఇంతలో ఈమెకు మరో మహిళ తోడైంది. ఇద్దరూ కలిసి బలవంతగా జుట్టుపట్టుకొని ఈడ్చుకొట్టి పదిఅడుగుల ఎత్తున్న బ్రిడ్జిపై నుంచి విసిరేసింది. అనంతరం ఆమె నీళ్లలో లేచి నిలబడిన దృశ్యాలు కూడా రికార్డయ్యాయి. అయితే బాధిత మహిళ క్షేమ సమాచారం మాత్రం అందుబాటులో లేదు.

ఈ మొత్తం సంఘటనను వీడియో తీసిన  వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేశారు. బాధిత మహిళ పోర్చుగీస్ భాషలో ప్రాధేయపడుతున్నట్టు, భర్త ప్రియురాలిపై భార్య దాడిచేసిందని వీడియోను షేర్ చేసిన వ్యక్తి పేర్కొన్నాడు. ఈ హింసాత్మక వీడియో దాదాపు 30  సెకండ్లు నిడివి ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement