షాకింగ్‌ వీడియో: ఎలక్ట్రిక్ బస్సు బీభత్సం, ఒకరు మృతి | Shocking video DTC bus rams into car parked vehicles one dead | Sakshi
Sakshi News home page

షాకింగ్‌ వీడియో: ఎలక్ట్రిక్ బస్సు బీభత్సం, ఒకరు మృతి

Published Sat, Nov 4 2023 8:42 PM | Last Updated on Sat, Nov 4 2023 9:02 PM

Shocking video DTC bus rams into car parked vehicles one dead - Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (డీటీసీ) ఎలక్ట్రిక్ బస్సు బీభత్సం సృష్టించింది. శరవేగంతో వచ్చిన బస్సు  ఆగి ఉన్న పలు వాహనాలపై దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడం సంచలనం రేపింది. నగరంలోని రోహిణి సౌత్ ఏరియాలో శనివారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

మితిమీరిన వేగంగో వచ్చిన డీటీసీ ఎలక్ట్రిక్ బస్సు మొదట కారును ఢీకొట్టింది. ఆ తర్వాత పేవ్‌మెంట్ దగ్గర పార్క్ చేసిన ఈ-రిక్షా, ద్విచక్ర వాహనాలపైకి దూసు కెళ్లింది. దీంతో అక్కడున్న వారు దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఈ  ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాల్లో   ఈ దృశ్యాలు రికార్డ్‌ అయ్యాయి. మరోవైపు ప్రమాదానికి దారి తీసిన విషయంపై   డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు  విచారణ చేపట్టారు. అతివేగంతోనే బస్సు డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయినట్లు తెలుస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement