న్యూఢిల్లీ: ఢిల్లీ నగరం ప్రమాదాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. గత కొంతకాలంగా హస్తీనాలో నేర సంఘటనలు ఎక్కువగా వెలుగుచూస్తున్నాయి. యాధృచికంగా, ఉద్ధేశపూర్వంగా జరిగినా యాక్సిడెంట్లు, హత్యలు వంటి కేసులతో దేశ రాజధాని నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ఇటీవల దేశం మొత్తం ఉల్కికి పడేలా చేసిన కంఝూవాలా కారు ప్రమాదం(కారుతో ఢీకొట్టి అంజలి అనే యువతిని ఈడ్చుకెళ్లిన ఘటన) తరువాత అలాంటి కోవకే చెందిన దారుణాలు ఎక్కువగా నమోదవుతున్నాయి.
తాజాగా ఢిల్లీలో మరో అమానుష ఘటన చోటుచేసుకుంది. పశ్చిమ ఢిల్లీలోని రాజౌరి గార్డెన్ ప్రాంతంలోని రోడ్డుపై ఇద్దరి వ్యక్తుల మధ్య హారన్ విషయంలో గొడవ తలెత్తింది. వాగ్వాదం పెరిగి పెద్దదవడంతో.. ఓ వ్యక్తి కోపంతో తన కారుతో ఢీకొట్టాడు. దీంతో ఆ వ్యక్తి కారు బానెట్‌పై పడటంతో అలాగే 500 మీటర్లు(అర కిలోమీటరు) లాక్కెళ్లాడు. ఈ భయంకర దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.
రంగంలోకి దిగిన ఢిల్లీ పోలీసులు ఈ ఘటనపై ఏపీసీ సెక్షన్లు 279, 323, 341, 308 కేసు నమోదు చేశారు. సీసీటీవీ ఫుటేజీ కారు నెంబర్ ఆధారంగా నిందితుడిని గుర్తించిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఏ విషయంలో గొడవ జరిగింది, అసలు ఏం జరిగిందనే దానిపై బాధితుడి నుంచి వివరాలు సేకరిస్తున్నారు.
#WATCH | A man was dragged on car's bonnet in Delhi's Rajouri Garden(12.01)
— ANI (@ANI) January 14, 2023
An incident of road rage occured that led to incident shown in video. Case registered under IPC sec 279, 323, 341, 308. Accused identified, being interrogated: Delhi Police
(Visuals confirmed by Police) pic.twitter.com/RdVGuU7QXL
Comments
Please login to add a commentAdd a comment