ట్రాఫిక్ రూల్స్ పాటించాలని పోలీసులు ఎంత చెబుతున్నా వాహనదారులు మాత్రం అవేవీ పట్టించుకోవడంలేదు. ట్రాఫిక్ నిబంధనలు పాటించని కారణంగా ఎదుటివారు సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తుంది. ఈ క్రమంలో ప్రాణాలు కూడా పోయే పరిస్థితులు ఎదురుకావొచ్చు. తాజాగా ఇలాంటి ప్రమాదానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది.
కాగా, ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోను బెంగళూరు తూర్పు డివిజన్ ట్రాఫిక్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ) కళా కృష్ణస్వామి ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఇక, ఈ వీడియోలో రోడ్డుపై ఆపిన కారు డోర్‌ను డ్రైవర్ ఒక్కసారిగా తెరిచాడు. దీంతో ఆ కారు పక్కగా బైక్‌పై వెళ్తున్న వారు ఒక్కసారిగా ప్రమాదానికి గురయ్యారు. బైక్‌ను సడెన్‌గా పక్కకు మళ్లించడంతో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టి ఇద్దరు వ్యక్తులు కిందపడిపోయారు. దీన్ని గమనించిన స్థానికులు ఆ యువకులను కాపాడే ప్రయత్నం చేశారు. అయితే, ఈ ప్రమాదం వీడియో 2017లో జరిగినట్లు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా తెలుస్తున్నది.
ఇక, రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో వాహనదారులను హెచ్చరించేందుకు డీసీపీ కళా కృష్ణస్వామి ఈ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈ సందర్బంగా ‘దయచేసి మీరు మీ వాహనం తలుపులు తెరిచినప్పుడు అప్రమత్తంగా ఉండండి. ప్రాణాంతక ప్రమాదాలను నివారించండి’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఇక, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇది మరో ప్రమాదం..
Recently same type of accident happened in Mysuru too... passengers in car should watch rear before they open door. pic.twitter.com/zftDK4R1WN
— 🇮🇳 ಅಭಿಜ್ಞ ಎನ್ ಜಿ 🇮🇳 #FightCancer (@abhignang) September 28, 2022
Comments
Please login to add a commentAdd a comment