స్కూళ్లకు బాంబు బెదిరింపు | bomb placed in school | Sakshi
Sakshi News home page

స్కూళ్లకు బాంబు బెదిరింపు

Published Wed, Dec 20 2017 3:14 PM | Last Updated on Sat, Sep 15 2018 4:15 PM

bomb placed in school - Sakshi

జగిత్యాల : రెండు ప్రైవేటు స్కూళ్లలో బాంబులు పెట్టామని ఓ ఆంగతకుడు ఫోన్‌ చేసి జగిత్యాల పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టించాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు జగిత్యాలలోని ప్రైవేటు స్కూళ్లలో విద్యార్థులను బయటికి పంపించి తనిఖీలు చేపట్టారు. బాంబు స్క్వాడ్‌ సిబ్బందిని హుటాహుటిన రప్పించి సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ ఉదంతంతో స్కూలు సిబ్బంది, తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందుతున్నారు. పోలీసులు దీనికి సంబంధించిన వివరాలు బయటికి తెలియనివ్వడంలేదు. ఇప్పటి దాకా చుక్కారామయ్య, గౌతమి మోడల్‌ స్కూళ్లలో తనిఖీలు చేపడతున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement