Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

YS Jagan Declared June 4th As Vennupotu Day1
జూన్‌ 4న వెన్నుపోటు దినం: వైఎస్‌ జగన్‌

గుంటూరు, సాక్షి: ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేదాకా చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్‌సీపీ నిరసన గళం వినిపిస్తూనే ఉంటుందని పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ క్రమంలో.. ఎన్నికల ఫలితాలు వెలువడిన తేదీ జూన్‌ 4వ తేదీని వెన్నుపోటు దినం(Vennupotu Day)గా నిర్వహిస్తామని ప్రకటించారాయన. జూన్‌ 4వ తేదీన వెన్నుపోటు దినంగా నిర్వహిస్తాం. ఆరోజున ప్రజలతో కలిసి నిరసనలు చేపడతాం. కలెక్టర్లను కలిసి హమీల డిమాండ్‌ పత్రాలను సమర్పిస్తాం. చంద్రబాబు చేసిన మోసానికి నిరసనగా చేపడుతున్న ఈ కార్యక్రమంలో ప్రజలంతా కలిసి రావాలని కోరారాయన.ఇదీ చదవండి: YS Jagan-నాకు పోరాటాలు కొత్త కాదు

YS Jagan Reacts on liquor Scam Says Its Purely CBN Politics2
విజయసాయిలాంటి వాళ్ల స్టేట్‌మెంట్లకు విలువుందా?: వైఎస్‌ జగన్‌

సాక్షి, గుంటూరు: చంద్రబాబు మరోసారి తన మంత్ర దండం బయటకు తీశారని.. వ్యస్థలను మేనేజ్‌ చేస్తూ తన మోసాలను ప్రశ్నించేవారి గొంతును నొక్కేస్తున్నారని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అన్నారు. ఈ క్రమంలోనే.. లిక్కర్‌ స్కాం అంటూ తప్పుడు ప్రచారం తెరపైకి తెచ్చి రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగారని అన్నారాయన. గురువారం తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘‘మద్యం షాపులను ప్రభుత్వం నిర్వహిస్తే లంచాలు ఇస్తారా?. ప్రైవేట్‌ వ్యక్తులకు ఇస్తే లంచాలు ఇస్తారా?. ఎక్కడైనా దుకాణాలు 33 శాతం తగ్గిస్తే లంచాలు ఇస్తారా?. 2019-2024 మధ్య లిక్కర్‌ సేల్‌ తగ్గింది. ఒక్క కంపెనీకి లైసెన్స్‌ ఇవ్వలేదు. ట్యాక్స్‌లు పెంచాం. కాబట్టే లిక్కర్‌ కంపెనీలకు లాభాలు పోలేదు. తద్వారా రాష్ట్ర ఆదాయం పెంచాం. అదే సమయంలో.. మద్యం తాగడం తగ్గించడం ద్వారా ప్రజల ఆరోగ్యానికి మేలు చేశాం. ప్రతీ బాటిల్‌పై క్యూఆర్‌ కోడ్‌ పెట్టించాం.లాభాపేక్ష లేకుండా మా(వైఎస్సార్‌సీపీ) ప్రభుత్వం అమ్మకాలు జరిపాం... అసలు లిక్కర్‌ స్కాం (Jagan on Liquor Scam) ఎక్కడ జరిగింది?. అధికారంలోకి వస్తే మద్యం ధరలు తగ్గిస్తామని చంద్రబాబు అన్నారు. కానీ, ఇప్పుడు ఆయన పాలనలోనే అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారు. రాష్ట్రంలో ఈ 12 నెలల కాలంలో లిక్కర్‌ సేల్‌ పెరిగింది. కూటమి పాలనలో గల్లీ గల్లీకి బెల్ట్‌ షాపులు వెలిశాయి. బియ్యాన్ని డోర్‌ డెలివరీ చేయడం లేదు.. మద్యాన్ని చేస్తున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రుల కనుసన్నల్లోనే అవి నడుస్తున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా కొత్త కొత్త బ్రాండులను తీసుకొచ్చారాయన. గతంలో..(2014-19) తన హయాంలోనూ లిక్కర్‌ సేల్స్‌ పెంచుకుంటూ పోయారు. తద్వారా అమ్మకాలు పెరిగాయి. కాబట్టే లిక్కర్‌ కంపెనీలకు లాభాలు వెళ్లాయి. ఇప్పుడు అదే జరుగుతోంది. అలాంటప్పుడు స్కాం ఎక్కడ జరిగింది?. డిస్టరీలకు లబ్ధి చేకూర్చేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితి మా హయాంలో ఉందా?’’ అని జగన్‌ ప్రశ్నించారు.గతంలో లిక్కర్‌ స్కాంలో నిందితుడిగా ఉన్న చంద్రబాబు ఇవాళ్టికి బెయిల్‌ మీద ఉంది నిజం కాదా? అని వైఎస్‌ జగన్‌ ప్రశ్నించారు. ‘‘చంద్రబాబు.. లాటరీ పేరుతో రిగ్గింగ్‌ చేసి మద్యం షాపులు దోచుకున్నారు. ఆనాడు కూడా ప్రైవేట్‌ సిండికేట్‌కు మేలు చేశారు. తనకు కావాల్సిన కంపెనీలకే అనుమతులు ఇచ్చారు. 2015-19 మధ్య ఐదు కంపెనీలు 69 శాతం ఆర్డరులు ఇచ్చారు. తద్వారా కొన్నిబ్రాండ్‌లకు మాత్రమే డిమాండ్‌ సృష్టించారు. ఇప్పుడు మళ్లీ ప్రైవేట్‌ సిండికేట్‌కు లబ్ధి చేకూర్చడం కోసం.. తన పాలసీని కొనసాగించడం కోసం.. ఏం స్కాం జరగకపోయినా వైఎస్సార్‌సీపీ హయాంలో లిక్కర్‌ స్కాం జరిగిందంటూ గగ్గోలు పెడుతున్నారు. భయపెట్టి.. బెదిరించి.. తప్పుడు సాక్ష్యాలు సృష్టించి.. తప్పుడు వాంగ్మూలాలతో చంద్రబాబు లిక్కర్‌ స్కాం అంటూ భయానక పరిస్థితులు సృష్టిస్తున్నారు. చిన్నస్థాయి ఉద్యోగులను బెదిరించి వాంగ్మూలాలు తీసుకున్నారు. చంద్రబాబుకు లొంగిపోయిన మరో వ్యక్తి విజయసాయిరెడ్డి(V. Vijayasai Reddy). వైఎస్సార్‌సీపీకి సరిపడా ఎమ్మెల్యేలు లేరని, తనకు మరోసారి రాజ్యసభ అవకాశం ఉండదని.. మూడేళ్ల టర్మ్‌ ఉండగానే కూటమికి, చంద్రబాబుకు మేలు జరుగుతుందని తెలిసి.. ప్రలోభాలకు లొంగిపోయి తన సీటును అమ్మేసుకున్నారు. అలాంటి వ్యక్తి ఇచ్చే స్టేట్‌మెంట్‌, వాంగ్మూలానికి ఏం విలువ ఉంటుంది?. లోక్‌సభ ఎంపీ, ఫ్లోర్‌ లీడర్‌ మిథున్‌ రెడ్డికి లిక్కర్‌ కేసుతో ఏం సంబంధం?. ఆయన తండ్రి పెద్దిరెడ్డి కనీసం ఆ శాఖ మంత్రి కూడా కాదు. ఐఏఎస్‌, ఐపీఎస్‌లను జైళ్లో పెట్టిన చరిత్ర లేదు. సీనియర్‌ అధికారులకు పోస్టింగులు ఇవ్వకుండా వేధిస్తున్నారు. అరెస్ట్‌ చేసిన ధనుంజయ్‌రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి, బాలాజీ గోవిందప్పకి ఏం సంబంధం. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుల్లో కేసిరెడ్డి ఒకరు. కేసిరెడ్డికి, బేవరేజెస్‌ కార్పొరేషన్‌కు ఏం సంబంధం?. విజయవాడ టీడీపీ ఎంపీ, కేసిరెడ్డికి వ్యాపార సంబంధాలు ఉన్నాయి. ఇద్దరూ కలిసి డైరెక్టర్లుగా ఉన్న కంపెనీలు ఉన్నాయి. కేసిరెడ్డి అప్రూవర్‌గా మారలేదని నిందితుడిగా చేర్చారు. కావాల్సిన స్టేట్‌మెంట్‌ ఇస్తే కేసిరెడ్డిని వదిలేసేవారు. లిక్కర్‌ స్కాంకి సంబంధించి ఒక్క ఫైల్‌ అయినా సీఎంవోకి వచ్చి సంతకం అయినట్లు చూపించగలరా? అని చంద్రబాబుకి సవాల్‌ చేస్తున్నా. కుట్రలు చేసి.. సంబంధం లేని వ్యక్తులనూ తెరపైకి తీసుకొచ్చి లిక్కర్‌ కేసులంటూ తప్పుడు కేసులు పెడుతూ.. రాజకీయ కక్షకు పాల్పడుతున్నారు. ఐపీఎస్‌లు సంజయ్‌, కాంతిలాల్‌ ఠాణా, జాషువా, విశాల్‌ గున్నీ, ధనుంజయ్‌, రఘురామ్‌ రెడ్డి ఇలా అధికారులను వేధిస్తున్నారు అని వైఎస్‌ జగన్‌ అన్నారు.

Tdp Mla Bandaru Satyanarayana Murthy Sensational Comments3
ఎమ్మెల్యేగా ఉన్నందుకు సిగ్గుపడుతున్నా.. బండారు సంచలన వ్యాఖ్యలు

సాక్షి, పాయకరావుపేట: ఏడాది నుంచి ఎమ్మెల్యేగా ఉన్నందుకు సిగ్గుపడుతున్నానంటూ టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి మహానాడు వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘నిధులు కేటాయింపులో వివక్ష చూపుతున్నారు. ప్రజల్లో తిరగలేకపోతున్నా.. సమాధానం చెప్పలేకపోతున్నా.. ఇప్పటివరకు ఒక్క అభివృద్ధి పని కూడా చేయలేకపోయా’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.చోడవరం, మాడుగుల నియోజకవర్గాలపై వివక్ష చూపిస్తున్నారు. ప్లానింగ్ బోర్డు మీటింగ్‌లో ప్రస్తావించి నిధులు ఇవ్వాలని కోరినా ఇవ్వలేదు. మాడుగుల చోడవరం ప్రజలు టీడీపీకీ ఓటు వేయలేదా?. ప్రశ్నించే వేదిక ఇదే.. నేను ప్రెస్ మీట్ పెట్టి అడగడం లేదు. ఆరోపించడం లేదు. అందుకే మహానాడు ద్వారా మంత్రులను నియోజకవర్గం ప్రజల తరపున ప్రశ్నిస్తున్నా’’ అంటూ బండారు వ్యాఖ్యానించారు.మరో వైపు, టీడీపీ కాకినాడ జిల్లా మహానాడులో టీడీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కూడా సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఏపీలో కూటమి ఎన్నాళ్లు ఉంటుంది.. పార్టీ ఆవిర్భావం తర్వాత ఎన్ని పార్టీలతో పొత్తు పెట్టుకోలేదు.. కూటముల నుంచి ఎన్నిసార్లు బయటకు రాలేదు అంటూ ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. ప్రభుత్వంలో పదవులు ఎవరికి ఇస్తున్నారు?. పార్టీ నిర్ణయాల వల్ల టీడీపీ నిర్వీర్యం అయిపోతుందని చెప్పుకొచ్చారు.

Harish Rao Meets Kcr At Farmhouse In Erravalli4
నోటీసులపై ఏం చేద్దాం?.. ఎర్రవల్లి ఫాంహౌస్‌లో కేసీఆర్‌తో హరీష్‌రావు భేటీ

సాక్షి, సిద్ధిపేట జిల్లా: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌తో మాజీ మంత్రి హరీష్‌ రావు భేటీ అయ్యారు. ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసానికి వెళ్లిన హరీష్‌రావు.. రెండు గంటల నుంచి కేసీఆర్‌తో మంతనాలు సాగిస్తున్నారు. కాళేశ్వరం కమిషన్‌ నోటీసుల నేపథ్యంలో వీరి భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. కాళేశ్వరం కమిషన్ నోటీసులపై స్పందించాలా? వద్దా? అన్న దానిపై చర్చిస్తున్నట్టు సమాచారం. కమిషన్ విచారణకు వెళ్లాలా? లేదా? అన్న దానిపై కూడా మంతనాలు జరుపుతున్నట్లు తెలిసింది.కాగా, ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ కమిషన్‌ విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు ఉన్నతాధికారులు, ఇతరులను కమిషన్‌ విచారించింది. బీఆర్‌ఎస్‌ అధినేత కె.చంద్రశేఖర్‌రావుకు నోటీసులు జారీ చేసింది. జూన్‌ 5వ తేదీన విచారణకు హాజరుకావాలని తెలిపింది.బీఆర్‌ఎస్‌ హయాంలో మంత్రులుగా పనిచేసిన హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌లకు సైతం నోటీసులు ఇచ్చింది. ముగ్గురికీ వేర్వేరుగా మూడు పేజీలున్న నోటీసులను మెసెంజర్‌ ద్వారా అలాగే రిజిస్టర్‌ పోస్టులోనూ పంపింది. వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని సూచించింది. జూన్‌ 6న హాజరుకావాలని హరీశ్‌రావుకు, 9వ తేదీన రమ్మని ఈటల రాజేందర్‌కు తెలిపింది.కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బరాజ్‌ల నిర్మాణంలో అవకతవకలు జరిగాయని అనుమానిస్తున్న ప్రభుత్వం, సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించేందుకు గత ఏడాది మార్చిలో జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ను నియమించింది. బరాజ్‌ల నాణ్యతపై కూడా విచారించాలని సూచించింది. దీనిపై దాదాపుగా విచారణ పూర్తి చేసిన కమిషన్, రెండుమూడు రోజుల్లో నివేదిక ఇచ్చేందుకు సిద్ధమవుతోందని భావిస్తున్న తరుణంలో.. కమిషన్‌ గడువును మరో రెండు నెలలు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Jaffer Picks IND vs ENG Tests Squad Bumrah As Captain, No Sudharsan or Nitish5
కెప్టెన్‌గా బుమ్రా.. సుదర్శన్‌కు దక్కని చోటు!.. శార్దూల్‌కు ఛాన్స్‌!

భారత టెస్టు జట్టు కొత్త కెప్టెన్‌ ఎవరు?.. ఇంగ్లండ్‌ పర్యటనలో ఐదు టెస్టు మ్యాచ్‌లు ఆడే జట్టు ప్రకటన ఎప్పుడు?.. భారత క్రికెట్‌ వర్గాల్లో ఇప్పుడిదే చర్చనీయాంశం. మాజీ క్రికెటర్లలో దిగ్గజం సునిల్‌ గావస్కర్‌ సహా వసీం జాఫర్‌, క్రిష్ణమాచారి శ్రీకాంత్‌ తదితరులు జస్‌ప్రీత్‌ బుమ్రాకే పగ్గాలు అప్పగించాలని సూచిస్తున్నారు.మరోవైపు.. రవిశాస్త్రి వంటి మరికొంత మంది మాజీలు యువకుడైన శుబ్‌మన్‌ గిల్‌ను కెప్టెన్‌గా నియమించాలని, పేస్‌ దళాన్ని ముందుకు నడిపిస్తున్న బుమ్రాపై అదనపు భారం వద్దని అభిప్రాయపడుతున్నారు.కాగా దిగ్గజ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి, కెప్టెన్‌ రోహిత్‌ శర్మ టెస్టులకు రిటైర్మెంట్‌ ప్రకటించిన తర్వాత.. ఈ సిరీస్‌తో టీమిండియా టెస్టు చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలుకానుంది. ఇద్దరు స్టార్ల నిష్క్రమణ తర్వాత తొలిసారి విదేశీ గడ్డపై రెడ్‌బాల్‌ క్రికెట్‌లో భారత జట్టు ఎలా రాణిస్తుందనే అంశంపైనే అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది.వసీం జాఫర్‌ ఎంచుకున్న జట్టు ఇదేఇక మే 24న బీసీసీఐ ఇంగ్లండ్‌ టూర్‌కు జట్టును ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఈలోపే భారత మాజీ ఓపెనర్‌ వసీం జాఫర్‌ పదహారు మంది సభ్యులతో కూడిన తన జట్టును ప్రకటించాడు. ఈ జట్టుకు బుమ్రాను కెప్టెన్‌గా ఎంపిక చేసిన వసీం.. శుబ్‌మన్‌ను అతడికి డిప్యూటీగా నియమించాడు.సాయి సుదర్శన్‌, నితీశ్‌లకు మొండిచేయిఅయితే, మొదటి నుంచి రేసులో ఉన్న సాయి సుదర్శన్‌ పేరును మాత్రం వసీం జాఫర్‌ పరిగణనలోకి తీసుకోలేదు. ఐపీఎల్‌-2025లో అదరగొడుతున్న ఈ గుజరాత్‌ టైటాన్స్‌ బ్యాటర్‌ను కాదని.. టెస్టు స్పెషలిస్టు, ఇంగ్లండ్‌ లయన్స్‌తో తలపడే భారత్‌-ఎ జట్టు కెప్టెన్‌ అయిన అభిమన్యు ఈశ్వరన్‌కు పెద్దపీట వేశాడు.అంతేకాదు.. ఆస్ట్రేలియా పర్యటనలో సెంచరీతో ఆకట్టుకున్న ఆంధ్ర పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ నితీశ్‌ కుమార్‌ రెడ్డికి కూడా వసీం జాఫర్‌ మొండిచేయి చూపాడు. అతడికి బదులు సీనియర్‌ శార్దూల్‌ ఠాకూర్‌వైపే మొగ్గుచూపాడు.శ్రేయస్‌ అయ్యర్‌ లేదంటే కరుణ్‌ నాయర్‌ఇక వికెట్‌ కీపర్ల కోటాలో రిషభ్‌ పంత్‌తో పాటు ధ్రువ్‌ జురెల్‌కు స్థానమిచ్చిన వసీం జాఫర్‌.. మిడిలార్డర్‌లో శ్రేయస్‌ అయ్యర్‌ లేదంటే కరుణ్‌ నాయర్‌లకు ప్రాధాన్యం ఇస్తానని తెలిపాడు. ఇక స్పిన్‌ దళంలో చైనామన్‌ బౌలర్‌ కుల్దీప్‌ యాదవ్‌తో పాటు.. ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజాతో పాటు వాషింగ్టన్‌ సుందర్‌కు చోటిచ్చాడు ఈ మాజీ క్రికెటర్‌.అదే విధంగా.. ఫాస్ట్‌ బౌలర్ల బృందంలో బుమ్రా, మహ్మద్‌ సిరాజ్‌, మహ్మద్‌ షమీలకు చోటిచ్చిన వసీం జాఫర్‌.. నాలుగో ఆప్షన్‌గా అర్ష్‌దీప్‌ సింగ్‌, ప్రసిద్‌ కృష్ణ, ఆకాశ్‌ దీప్‌లలో ఒకరిని ఎంచుకుంటానని తెలిపాడు. ఈ మేరకు సోషల్‌ మీడియా వేదికగా ఇంగ్లండ్‌తో టెస్టులకు తన జట్టును ప్రకటించిన వసీం జాఫర్‌.. మరి మీ ఎంపిక ఏమిటంటూ క్రికెట్‌ ప్రేమికులను అడగ్గా.. మెజారిటీ మంది అతడి జట్టుతోనే ఏకీభవిస్తున్నారు. కాగా జూన్‌ 20 నుంచి ఇంగ్లండ్‌- టీమిండియా మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ ఆరంభం కానుంది.ఇంగ్లండ్‌తో టెస్టులకు వసీం జాఫర్‌ ఎంచుకున్న భారత జట్టుయశస్వి జైస్వాల్‌, కేఎల్‌ రాహుల్‌, శుబ్‌మన్‌ గిల్‌ (వైస్‌ కెప్టెన్‌), శ్రేయస్‌ అయ్యర్‌/కరుణ్‌ నాయర్‌, రిషభ్‌ పంత్‌ (వికెట్‌ కీపర్‌), కుల్దీప్‌ యాదవ్‌, రవీంద్ర జడేజా, శార్దూల్‌ ఠాకూర్‌, మహ్మద్‌ షమీ, జస్‌ప్రీత్‌ బుమ్రా (కెప్టెన్‌), మహ్మద్‌ సిరాజ్‌, అభిమన్యు ఈశ్వరన్‌, ధ్రువ్‌ జురెల్‌ (వికెట్‌ కీపర్‌), సర్ఫరాజ్‌ ఖాన్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌/ప్రసిద్‌ కృష్ణ/ అకాశ్‌దీప్‌, వాషింగ్టన్‌ సుందర్‌.చదవండి: ఇంగ్లండ్‌ టూర్‌కు భారత జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా ఆయుశ్‌, వైభవ్‌ సూర్యవంశీకి చోటు

Tesla CFO Vaibhav Taneja Earns More Than Sundar Pichai And Satya Nadella Check Here How Much He Earned6
టెక్ సీఈఓల కంటే ఎక్కువ సంపాదన: ఎవరీ వైభవ్ తనేజా?

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ నేతృత్వంలోని టెస్లా కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ 'వైభవ్ తనేజా' భారీ సంపాదన పొంది వార్తల్లో నిలిచారు. 2024లో ఈయన సంపాదన ఏకంగా 139.5 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 11.94 వేలకోట్ల కంటే ఎక్కువ). ఇది మైక్రోసాఫ్ట్ సీఈఓ 'సత్య నాదెళ్ల'.. గూగుల్ సీఈఓ 'సుందర్ పిచాయ్'ల కంటే చాలా ఎక్కువ.2024లో సుందర్ పిచాయ్ సంపాదన 10.73 మిలియన్ డాలర్లు కాగా, సత్యనాదెళ్ళ సంపాదన 79.106 డాలర్లు. దీన్ని బట్టి చూస్తే.. వైభవ్ తనేజా సంపాదన (139.5 మిలియన్ డాలర్లు) చాలా ఎక్కువ అని స్పష్టమవుతోంది. అంతకు ముందు 2020లో నికోలాకు చెందిన కిమ్ బ్రాడీ 80.6 మిలియన్ డాలర్ల సంపాదనతో కొత్త రికార్డ్ క్రియేట్ చేశారు. దీనిని వైభవ్ అధిగమించారు.ఇదీ చదవండి: ఆర్థిక సంక్షోభం రాబోతోంది!.. రాబర్ట్ కియోసాకి హెచ్చరికటెస్లాలో తనేజా బేసిక్ శాలరీ 400000 డాలర్లు (రూ. 3.4 కోట్లు). అయితే స్టాక్ ఆప్షన్లు, ఈక్విటీ వంటి ఇతర ప్రయోజనాల కారణంగా ఈయన సంపాదన గణనీయంగా పెరిగింది.ఎవరీ వైభవ్ తనేజా?ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ డిగ్రీని పూర్తి చేసిన వైభవ్ తనేజా.. టెక్నాలజీ, టెలికమ్యూనికేషన్ అండ్ రిటైల్ రంగాలకు సంబంధించిన మల్టిపుల్ కంపెనీలలో 17 సంవత్సరాల కంటే ఎక్కువ అనుభవం ఉంది. ఈయన ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా నుంచి చార్టర్డ్ అకౌంటెన్సీని కూడా పూర్తి చేశారు. 2017లో టెస్లా కంపెనీలో కార్పొరేట్ కంట్రోలర్‌గా.. చేరిన వైభవ్ తనేజా సీఎఫ్ఓ వరకు ఎదిగారు.

Kesari : Chapter 2 Movie Review In Telugu7
‘కేసరి: చాఫ్టర్‌ 2(తెలుగు వెర్షన్‌)’ మూవీ రివ్యూ

బాలీవుడ్‌ స్టార్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ నటించిన తాజా దేశభక్తి చిత్రం ‘కేసరి: చాప్టర్‌ 2’. కరణ్‌ సింగ్‌ త్యాగి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్‌ 18న బాలీవుడ్‌లో రిలీజై మంచి టాక్‌ని సంపాదించుకుంది. ఇప్పుడీ చిత్రం తెలుగులోనూ విడుదల కానుంది. సురేశ్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై మే 23న ఇది తెలుగులో రిలీజ్‌ కానుంది. ఈనేపథ్యంలో తాజాగా మీడియా కోసం స్పెషల్‌ షో వేశారు. 1919లో జరిగిన జలియన్‌వాలా బాగ్‌ మారణకాండ ఉదంతాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిన ఈ చిత్రం ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం.కథేంటంటే..స్వాతంత్ర ఉద్యమంలో భాగంగా ఏప్రిల్‌ 13, 1919లో పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు సమీపంలో ఉన్న జలియన్‌వాలా బాగ్‌లో సమావేశం అయిన భారతీయులపై అప్పటి పంజాబ్‌ జనరల్‌ డయ్యర్‌ విచక్షణారహితంగా కాల్పులు జరుపుతాడు. తనకున్న అధికార బలంతో ఈ మారణకాండ గురించి స్థానిక వార్తా పత్రికల్లో రాకుండా చేస్తాడు. ఈ ఘటనపై అప్పటి బ్రిటీష్‌ ప్రభుత్వం ఓ కమిషన్‌ ఏర్పాటు చేస్తుంది. అందులో బ్రిటిష్‌ వైస్రాయ్‌ కౌన్సిల్‌లో సభ్యుడిగా ఉన్న భారత న్యాయవాది శంకరన్‌ నాయర్‌(అక్షయ్‌ కుమార్‌) కూడా ఉంటాడు. తమకు అనుకూలంగా రిపోర్ట్‌ ఇవ్వాలని శంకరన్‌పై ఒత్తిడి తెస్తారు. కానీ జలియన్‌వాలా బాగ్‌ ఘటన వెనుక పెద్ద కుట్ర ఉందని శంకరన్‌కు అర్థమవ్వడంతో ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేసి.. యువ అడ్వకేట్‌ దిల్‌రీత్‌ సింగ్‌(అనన్య పాండే)తో జనరల్‌ డయ్యర్‌పై కోర్ట్‌లో కేసు వేయిస్తాడు. బాధితుల తరపున ఆయన వాధిస్తాడు. డయ్యర్‌ తరపున వాధించేందుకు ఇండో బ్రిటన్ న్యాయవాది నెవిల్లే మెక్‌కిన్లే (ఆర్‌.మాధవన్‌) రంగంలోకి దిగుతాడు. ఎలాంటి సాక్ష్యాలే లేని ఈ కేసును శంకరన్‌ ఎలా డీల్‌ చేశాడు? డయ్యర్‌ చేసిన కుట్రను ప్రపంచానికి తెలియజేసేక్రమంలో శంకరన్‌కు ఎదురైన సమస్యలు ఏంటి? యువ అడ్వకేట్‌ దిల్‌రీత్‌ సింగ్‌ ఆయనకు ఎలాంటి సహాయం చేసింది? చివరకు డయ్యర్‌ చేసిన తప్పులను సాక్ష్యాలతో సహా ఎలా బయటపెట్టాడు? అనేదే మిగతా కథ.ఎలా ఉందంటే?శతాబ్దం క్రితం భారత్‌లో చోటుచేసుకున్న జలియన్‌ వాలాబాగ్ దురంతాన్ని ఇప్పటికీ మర్చిపోలేం. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న భారతీయులపై నాటి బ్రిటిష్‌ పాలకులు జరిపిన మారణకాండ గురించి పుస్తకాలల్లో చదివాం. భారతీయ న్యాయవాది శంకరన్‌ చేసిన న్యాయ పోరాటం గురించి కూడా విన్నాం. ఈ రెండిటికి దృశ్యరూపం ఇస్తే.. అది ‘కేసరి: ఛాప్టర్‌ 2’ చిత్రం అవుతుంది. జలియన్‌ వాలాబాగ్‌ దురంతాన్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తూనే..శంకరన్‌ చేసిన న్యాయ పోరుని హైలెట్‌ చేశారు. నిజంగా అప్పట్లో బ్రిటీష్‌ ఉన్నతాధికారిపై కేసు వేయడం అనేది ఆషామాషీ వ్యవహరం కాదు. కానీ బ్రిటిష్‌ వైస్రాయ్‌ కౌన్సిల్‌లో సభ్యుడిగా ఉన్న శంకరన్‌ ఆ సాహసం చేశాడు. దేశ స్వాతంత్రం కోసం ఆయన చేసిన త్యాగం ఎంత గొప్పదో దర్శకుడు కరణ్‌ సింగ్‌ మరోసారి తన సినిమా ద్వారా ప్రపంచానికి తెలియజేశాడు. ఈ హిస్టారికల్‌ కోర్ట్‌రూమ్‌ డ్రామాని అత్యంత సహజంగా తీర్చిదిద్దాడు. కోర్ట్‌ సన్నివేశాలే ఈ సినిమాకు కీలకం. శంకరన్‌, మెక్‌కిన్లే మధ్య జరిగే వాదనలు ఉత్కంఠను రేకిస్తూనే.. మధ్యలో వచ్చే ట్విస్టులు ఆకట్టుకుంటాయి. జలియన్‌వాలాబాగ్‌ ఘటన సన్నివేశంతో సినిమా ప్రారంభం అవుతుంది . ఆ తర్వాత శంకరన్‌ నేపథ్యం, కమీషన్‌ ఏర్పాటు వరకు కథనం నెమ్మదిగా సాగుతుంది. శంకరన్‌ డయ్యర్‌కు వ్యతిరేకంగా వాదించడం మొదలు పెట్టినప్పటి నుంచి కథనంపై ఆసక్తి పెరుగుతుంది. తొలి ట్రయల్‌లో శంకరన్‌ వాదనలు ఆకట్టుకుంటాయి. శంకరన్‌కి పోటీగా డయ్యర్‌ తరపున మెక్‌కిన్లే రంగంలోకి దిగడంతో కథనం మలుపు తిరుగుతుంది. సెకండాఫ్‌ మొత్తం కోర్ట్‌లో జరిగే వాదనల చుట్టూనే కథనం సాగుతుంది. క్లైమాక్స్‌ అదిరిపోతుంది. మొత్తంగా మనల్ని రెండున్నర గంటల పాటు ఆ కాలం నాటి పరిస్థితులను తీసుకెళ్లి.. బ్రిటీష్‌ పాలకులు చేసిన అరచకాలను చూపిస్తూనే స్వాతంత్రం కోసం మనవాళ్లు చేసిన పోరాటాలను గుర్తు చేసే చిత్రమిది. డోంట్‌ మిస్‌ ఇట్‌. ఎవరెలా చేశారంటే.. సర్‌ శంకరన్‌ నాయర్‌గా అక్షయ్‌ కుమార్‌ ఒదిగిపోయాడు. నిజమైన న్యాయవాదిలా ఆయన వాదనలు ఉంటాయి. క్లైమాక్స్‌లో ఆయన చేప్పే డైలాగ్స్‌ ఆకట్టుకుంటాయి. నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న మెక్‌ కిన్లేగా ఆర్‌ మాధవన్‌ ఒదిగిపోయాడు. యువ న్యాయవాది దిల్‌రీత్‌ గిల్‌గా అనన్య పాండే తనదైన నటనతో ఆకట్టుకుంది. శంకరన్‌ భార్యగా రేజీనా ఉన్నంతలో చక్కగానే నటించింది. మిగిలిన నటీనటులు తమ తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. సాష్వత్‌ సచ్‌దేవ్‌ నేపథ్య సంగీతం సినిమా స్థాయిని పెంచేసింది. పాటలు భావోద్వేగాన్ని రగిలించేలా ఉంటాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. ఆర్ట్‌ డిపార్ట్‌ మెంట్‌ పనితీరు అద్భుతం. 1919 నాటి పరిస్థితుల్ని.. నాటి వాతావరణాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారు. ఎడిటింగ్‌ పర్వాలేదు. తెలుగు డబ్బింగ్‌ చక్కగా కుదిరింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్‌

Avenged April 22 Attack in 22 Minutes PM Modi on op Sindoor8
పాకిస్తాన్‌కు ప్రధాని మోదీ వార్నింగ్

బికనీర్: జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడికి ప్రతిగా భారత్‌ ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) పేరుతో 22 నిమిషాల్లోనే ప్రతీకారం తీర్చుకుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ప్రతీ ఉగ్రవాద దాడికి పాకిస్తాన్‌ భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని ప్రధాన మోదీ హెచ్చరించారు. రాజస్థాన్‌లోని బికనీర్‌లో అమృత్‌ భారత్‌ స్టేషన్లను ప్రారంభించిన అనంతరం పలానాలో జరిగిన ప్రజా ర్యాలీలో ఆయన ప్రసంగించారు.ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ ఉగ్రదాడులకు పాల్పడుతున్న పాకిస్తాన్‌(Pakistan) భారీ మూల్యాన్ని చెల్లించాల్సి ఉంటుందని, అది ఆ దేశ సైన్యం, ఆర్థిక వ్యవస్థ భరించాల్సి వస్తుందన్నారు. పాక్‌ ఉగ్రవాదం ఎగుమతిని కొనసాగిస్తే, ఆ దేశం ఒక్క రూపాయి కోసం కూడా తడబడే పరిస్థితి వస్తుందని ప్రధాని మోదీ హెచ్చరించారు. భారతీయుల రక్తంతో ఆడితే పాకిస్తాన్‌ దానికి భారీ మొత్తంలో నష్టం చవిచూడాల్సి వస్తుందన్నారు.ఉగ్రవాదం అంతానికే ఆపరేషన్ సిందూర్ చేపట్టామని, ఇకపై ఉగ్ర దాడి జరిగినట్లయితే, తక్షణమే దానికి కఠిన ప్రతిస్పందన ఉంటుందని ప్రధాని మోదీ హెచ్చరించారు.. ఇందుకు సమయాన్ని, విధానాన్ని, నిబంధనలను భారత సైన్యం స్వయంగా నిర్ణయిస్తుందన్నారు. అణ్వాయుధాల బెదిరింపులతో భారతదేశం వెనక్కి తగ్గబోదని, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వ్యక్తులను, ప్రభుత్వాన్నీ వేరు చేయలేమని ప్రధాని స్పష్టం చేశారు. పాకిస్తాన్‌లో ‘స్టేట్’, ‘నాన్-స్టేట్ యాక్టర్స్’ (గూండాలు) కలసి ఆడే ఆటలు ఇక కొనసాగవన్నారు. 22వ తేదీన జరిగిన పాక్‌ దాడికి ప్రతిగా 22 నిమిషాల్లో తొమ్మిది ఉగ్రవాద స్థావరాలు ధ్వంసం చేశామని ప్రధాని పేర్కొన్నారు. భారత్ ప్రతీకార దాడి చేస్తే ఫలితం ఎంత ఘోరంగా ఉంటుందో ప్రపంచానికి స్పష్టంగా చూపించామని, ప్రతి భారతీయుడు(Indian) ఉగ్రవాదాన్ని నేలమట్టం చేయాలనే సంకల్పంతో ఉన్నారడన్నారు. భారత సైన్యం ప్రజల ఆశీర్వాదంతో ఆ సంకల్పాన్ని నెరవేర్చిందన్నారు. భారత ప్రభుత్వం మూడు దళాలకూ పూర్తి స్వేచ్ఛను ఇచ్చింది. పాకిస్తాన్‌ను మోకాళ్లపై సాగిలపడేలా చేయడానికి భారత సైన్యం చక్రవ్యూహం రచించిందని ప్రధాని మోదీ అన్నారు. 26 మంది ప్రాణాలను బలిగొన్న పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతిగా మే 7న భారత్‌ ప్రతీకార సైనిక చర్య ప్రారంభించింది. ప్రభుత్వ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం ఈ ఆపరేషన్ సమయంలో జైష్-ఎ-మొహమ్మద్, లష్కరే-ఎ-తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ తదితర ఉగ్రవాద గ్రూపులతో సంబంధమున్న దాదాపు 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు.ఇది కూడా చదవండి: 103 అమృత్‌ స్టేషన్లను ప్రారంభించిన ప్రధాని మోదీ

Content creator tests former bodybuilder Vince Girondas 900 egg diet9
బాడీ బిల్డర్స్‌ 900 ఎగ్స్‌ డైట్‌..! ఆరోగ్యానికి మంచిదేనా?

ఇటీవల హెల్దీగా ఉందాం అనే నినాదం ప్రజల్లో బాగా వళ్తోంది. అందురూ ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు తీసుకునేందుకే ఇష్టపడుతున్నారు. పైగా తమ శరీరానికి సరిపోయే డైట్‌ని ఫాలోఅయ్యి ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నారు. ఆ నేపథ్యంలోనే ఇక్కడొక కంటెంట్‌ క్రియేటర్‌, మాజీ బాడీబిల్డర్‌ తనపైన అధిక ప్రోటీన్‌ ఫుడ్‌ ప్రయోగం చేసుకున్నాడు. అందుకోసం అని రోజుకి 30 గుడ్లు చొప్పున నెలకు 900 గుడ్లు తింటే త్వరితగతిన కండరాలు ఏర్పడి బాడీబిల్డర్‌గా మారడానికి తోడ్పడుతుందో లేదా తెలుసుకోవాలని తనమీదే స్వయంగా ప్రయోగం చేసుకున్నాడు. చివరికి ఏమైందంటే..యూట్యూబ్‌ కంటెంట్‌ క్రియేటర్‌, మాజీ బాడీ బిల్డర్‌ జోసెఫ్ ఎవెరెట్ ప్రముఖ బాడీబిల్డింగ్ లెజెండ్ విన్స్ గిరోండా చెప్పే 900 ఎగ్స్‌ డైట్‌ని పరీక్షించాలనుకున్నాడు. గిరోండా తాను రోజు 30 గుడ్డు తింటానని, అదే తన కండల తిరిగిన దేహం రహస్యమని చెబుతుంటారు. అది ఎంతవరకు నిజం అని తెలుసకునేందుకు ఈ యూట్యూబర్‌ తనమీద ప్రయోగం చేసుకున్నాడు. అందుకోసం రోజుకి 30కి పైగా గుడ్లను డైట్‌లో తీసుకునేవాడు. అతను గుడ్డు తెల్లసొన ఆమ్లెట్‌లు, పచ్చసొన స్మూతీలు ఆహారంతో చేర్చుకునేవాడు. వాటితో పాటు రైస్‌, మాంసం, పెరుగు, పండ్లు, తేనె తదితరాలు తీసుకున్నాడు. ఈ ఆహారం తోపాటు వెయిట్ లిఫ్టింగ్‌కి సంబంధించిన అన్ని వ్యాయామాలు చేశాడు. ఆ తర్వాత తన బాడీలో జరిగిన మార్పులపై వైద్య పరీక్షలు జరిపించగా..మంచికొలస్ట్రాల్‌ స్థాయిలు పెరగడం తోపాటు, రక్తంలో చెడు కొలస్ట్రాల్‌కి సంబంధించి గణనీయమైన మార్పులు కనిపించాయి.ఈ డైట్‌ మంచిదేనా..? ప్రముఖ డైటీషియన్‌ కనిక మల్హోత్రా ఇలాంటి డైట్‌తో పలు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. గుడ్డులోని పచ్చసొనలో ఉండే అధిక కొలస్ట్రాల్‌ రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ స్థాయిలను పెంచుతుందన్నారు. ఇది గుడ్డు జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుందని అన్నారు. అంతేగాదు అధికంగా గుడ్లు తీసుకోవడం వల్ల.. కొంతమంది వ్యక్తుల్లో పొట్ట ఉబ్బరం, గ్యాస్‌, విరేచనలు వంటి జీర్ణ సమస్యలు ఉత్ఫన్నమవుతాయని అన్నారు. అంతేగాదు ఇలా గుడ్లు అధికంగా తీసుకుంటే పోష అసమతుల్యత వస్తుందన్నారు. అలాగే పచ్చిగా లేదా తక్కువగా ఉడికించి తీసుకుంటే సాల్మొనెల్లా ఇన్ఫెక్షన్ బారినపడే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.కండరాల పెరుగుదల కోసం గుడ్డు అధికంగా తీసుకోవాల్సిందేనా..గుడ్డు కండరాల పెరుగుదలకు ఉపయోగపడినప్పటికీ..అధికంగా తీసుకోవడం ఎట్టి పరిస్థితుల్లోనూ మంచిది కాదని తేల్చి చెప్పారు. గుడ్డులోని పచ్చసొన కండరాల ప్రోటీన్‌ సంశ్లేషణను సమర్థవంతంగా పెంచుతుందన్నారు. దీనిలో ప్రోటీన్‌ కంటెంట్‌ ఇతర వాటిలో కంటే ఎక్కువ. పైగా దీన్ని ఉడకించి తింటేనే సులభంగా అరుగుతుంది లేదంటే శరీరం దాన్ని అరిగించుకోవడానికి చాలా సమయం తీసుకుంటుందన్నారు. చెప్పాలంటే సోయా లేదా గోధుమలు, పాలు తదితరాల కంటే గుడ్డులో ప్రోటీన్‌ సంశ్లేషణ ఎక్కువ కాబట్టి దీన్ని తగు మోతాదులో తీసుకుంటే కండరాల పెరుగుదలకు, బాడీ బిల్డింగ్‌కి ఉపయోగపడుతుందని తెలిపారు. అంతకు మించి అంటే..మరిన్ని ఆరోగ్య సమస్యలు కొనితెచ్చుకున్నట్లేనని హెచ్చరించారు నిపుణులు. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాల కోసం వ్యక్తిగత వైద్యులను లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.(చదవండి: డ్యాన్స్‌ బేబీ డ్యాన్స్‌..! పార్కిన్‌సన్స్‌కు నృత్య చికిత్స)

Supreme Court Serious On ED Over Tamilnadu Issue10
హద్దు దాటారు.. తమిళనాడులో ఈడీ సోదాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం

ఢిల్లీ: తమిళనాడులో లిక్కర్‌ స్కాం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈడీ హద్దులు దాడి వ్యవహరించిందని సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ బీఆర్‌ గవాయి వ్యాఖ్యలు చేశారు. దేశంలోని సమాఖ్య వ్యవస్థను ఈడీ ఉల్లంఘిస్తోందని మండిపడ్డారు.ఇటీవల తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్‌లో ఈడీ సోదాలను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్బంగా తమిళనాడు ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. సిబల్‌ వాదనలు వినిపిస్తూ.. 2014-21 వరకు రాష్ట్ర ప్రభుత్వమే అవినీతి ఆరోపణలపై 41 ఎఫ్ఐఆర్లు నమోదు చేసింది. కానీ, ఈడీ 2025లో టాస్మాక్ హెడ్ క్వార్టర్లలో సోదాలు చేసి ఉద్యోగుల ఫోన్లు, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకుందన్నారు. ఈ సందర్భంగా చీఫ్‌ జస్టిస్‌ బీఆర్‌ గవాయి ధర్మాసనం స్పందిస్తూ.. వ్యక్తులపైన కేసు రిజిస్టర్ చేయవచ్చు కానీ.. మొత్తం కార్పొరేషన్‌ను దీనికి సంబంధం ఏమిటి? అని ప్రశ్నించింది. ఈడీ హద్దులు దాడి వ్యవహరించింది. దేశంలోని సమాఖ్య వ్యవస్థను ఈడీ ఉల్లంఘిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. అనంతరం, తమిళనాడు లిక్కర్ స్కాం కేసులో ఈడీ దర్యాప్తుపై సుప్రీంకోర్టు స్టే విధించింది.CJI: We have granted stay; Sibal: they are investigating-why are ED coming here?ASG Raju: We have done nothing wrong CJI: If they have registered FIR, why ED should come? Raju: 1000 crore fraudCJI: Where is the predicate offence? ED passing all limits— Live Law (@LiveLawIndia) May 22, 2025ఇదిలా ఉండగా.. తమిళనాడులో లిక్కర్ స్కాం కేసులో 1,000 కోట్లకు పైగా ఆర్థిక అవకతవకలకు సంబంధించి ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసు తమిళనాడులో రాజకీయ గందరగోళాన్ని సృష్టించింది. తమిళనాడులో మద్యం విక్రయాలపై పూర్తి గుత్తాధిపత్యం కలిగిన రాష్ట్ర ప్రభుత్వ సంస్థ TASMAC, రాష్ట్ర ఆదాయంలో గణనీయమైన భాగం (సంవత్సరానికి దాదాపు రూ. 45,000 కోట్లు) సమకూరుస్తుంది. ఇది రాష్ట్రంలో 4,700కు పైగా రిటైల్ షాపుల ద్వారా మద్యం పంపిణీ చేస్తుంది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రకారం.. TASMAC కార్యకలాపాలలో బహుళ అవకతవకలు జరిగాయి. ఇందులో టెండర్ మానిప్యులేషన్, అక్రమ నగదు లావాదేవీలు, రూ. 1,000 కోట్లకు పైగా మనీలాండరింగ్ జరిగినట్లు ఆరోపించింది. కాగా ఇటీవల ఈ కేసులో భాగంగా టాస్‌మార్క్ అధికారుల ఇళ్లు, ఆఫీస్‌లలో ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. దీంతో ఈడీ అధికారుల తీరుకు వ్యతిరేకంగా TASMAC అధికారులు సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement