పంచాయతీ ని‘బంధనాలు’ | Conditions In Panchayats | Sakshi
Sakshi News home page

పంచాయతీ ని‘బంధనాలు’

Published Sat, Mar 9 2019 10:43 AM | Last Updated on Sat, Mar 9 2019 10:51 AM

Conditions In Panchayats - Sakshi

తిమ్మాపూర్‌ మండలంలో వెలసిన వెంచర్‌  

సాక్షి, అల్గునూర్‌: పంచాయతీ పాలకవర్గాలు ఇకపై లేఅవుట్‌ల అనుమతి విషయంలో ఆచితూచి వ్యవహించాల్సి ఉంటుంది. నిబంధనల ప్రకారం లేని లేఅవుట్‌లను సరిచూసుకోకుండా మామూళ్లు తీ సుకుని ఎవరికైనా అనుమతి ఇస్తే ఆ గ్రాపంచాయ తీ పాలకవర్గం రద్దయ్యే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కొత్త పంచాయతీరాజ్‌ చట్టంలో కఠినమైన నిబంధనలు చేర్చి పకడ్బందీగా అమలు చేస్తోంది. నగరాలు, పట్టణాల శివారు గ్రామాల్లోని అక్ర మ లేఅవుట్లు విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయి. దీంతో ప్రభుత్వం  నిబంధనలు కఠినం చేసింది.  
 

ఇవీ నిబంధనలు 
అమల్లోకి వచ్చిన కొత్త చట్టం ప్రకారం 2018 మా ర్చి 18 వరకు ఉన్న లేఅవుట్ల జాబితాలను కొత్త పాలకవర్గాలు ప్రకటించిన అనంతరం వాటిపై చర్యలు తీసుకోవాలి. గ్రామాల్లోని వ్యవసాయ భూమిని ఇళ్లస్థలాలుగా మార్చేందుకు ముందుగా వ్య వసాయ భూమి చట్టం కింద రుసుం చెల్లించాల్సి ఉంటుంది. ఇలా భూ మార్పిడి ప్రక్రియ తర్వాతే లేఅవుట్‌ ప్రతిపాదన దరఖాస్తును గ్రామపంచాయతీలకు ఇవ్వాలి. వాటిని ఏడురోజుల్లో జిల్లా టౌన్, కంట్రీ ప్లానింగ్‌(డీటీసీపీ) అనుమతి జారీచేసే సంస్థలకు పంపాలి.

ఈ గడువులోపు గ్రామపంచాయతీ నిర్ణయం తీసుకోకున్నా అనుమతి ఇచ్చినట్లుగానే పరిగణించాల్సి ఉంటుందని చట్టంలో ఉంది. లే అవుట్లలో డ్రెయినేజీ, రోడ్డు, వీధిదీపాలు, తాగునీటి వ్యవస్థ ఏర్పాటుచేయాలని సాంకేతిక కమిటీ లేఅవుట్‌ నిర్వాహకులకు సూచిస్తోంది. లేఅవుట్‌ పరిధిలోని సామూహిక స్థలాలు, రోడ్లను పంచాయతీపేరుతో రిజిస్ట్రేషన్‌ చేయించాలి. అన్నింటినీ పరిశీలించిన డీటీసీపీ నెలలోపు ఆమోదించాల్సి ఉంటుంది. లేఅవుట్‌ నిర్వాహకులు విక్రయానికి ప్రతిపాదించే మొత్తం స్థలంలో 15 శాతాన్ని గ్రామపంచాయతీకి తనఖా పెట్టాలి. అయితే గ్రామకంఠం స్థలానికి ఈ నిబంధనలు వర్తించవు. లేవుట్‌లో ప్రజావసరాలకు కేటాయించిన స్థలాన్ని ఎవరికైనా విక్రయిస్తే మూడేళ్లవరకు జైలుశిక్ష ఉంటుంది. డీటీసీపీ కమిటీ ఆదేశాలు లేకుండా లేఅవుట్‌కు అనుమతి ఇస్తే గ్రామపంచాయతీ పాలకవవర్గం రద్దవుతుంది. 
 

చట్టం క్రమబద్దీకరణ అంశం 
అక్రమ లేఅవుట్ల క్రమబద్దీకరణ అంశాన్ని చట్టం లో పొందుపరిచారు. లేఅవుట్లలో నిర్దేశిత అవసరాలకు అనుగుణంగా అనుమతులు లేనప్పుడే అది అక్రమం అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో వసతుల కల్పనకు అవకాశం కల్పిస్తారు. నిబంధనలకు అనుగుణంగా వసతులు కల్పించిన తర్వాతే లే అవుట్‌ను క్రమబద్దీరిస్తారు. అయితే లేఅవుట్‌కు వినియోగించే స్థలానికి అప్పటి మార్కెట్‌ విలువ తో పోలిస్తే పదిశాతం మొత్తాన్ని గ్రామపంచాయతీకి చెల్లిస్తే క్రమబద్దీకరించేందుకు అవకాశం ఉంటుంది. అక్రమ లే అవుట్‌లో వసతులు కల్పించే విషయంలో విఫలమైతే దాన్ని అక్రమంగానే నిర్ధారిస్తారు. ఎంతమొత్తం చెలిచినా దీని క్రమబద్దీకరించే అవకాశం ఉండదు.  
 

ఇవి పాటించాల్సిందే 
కొత్త పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం ఇప్పటి నుంచి అనుమతులు ఉన్నవాటినే కొనసాగిస్తారు. వ్యవసాయ భూమిని కమర్షియల్‌ భూమిగా మా ర్చేందుకు మొదటగా ఆర్డీఓకు దరఖాస్తు చేసుకోవాలి. అనతరం. రికార్డులను గ్రామపంచాయతీలకు అప్పగించాలి. వాటిని గ్రామపంచాయతీ అధికారులు సాంకేతిక నిర్ణయం కోసం టౌన్‌ప్లానింగ్‌ అధికారులకు పంపుతారు. రెండున్నర ఎకరాలకు జిల్లాస్థాయి, ఐదు ఎకరాలలోపు రీజియన్‌ స్థాయి, ఆపై దాటితే రాష్ట్రస్థాయి టౌన్‌ ప్లానింగ్‌ అధికారుల సర్వేచేసి అనుమతులు ఇస్తారు. నివేదికను రెవెన్యూ, గ్రామపంచాయతీ అధికారులకు పంపుతారు. దీనిపై పంచాయతీ వారు గ్రామసభలో తీ ర్మాణిస్తారు. దరఖాస్తుదారులు 15శాతం భూమిని ప్రజాప్రయోజనాల కోసం ఖాళీగా వదిలేయాలి. వ్యవసాయ భూమిని కమర్షియల్‌ భూమిగా మా ర్చేందుకు మార్కెట్‌ విలువ ప్రకారం(రిజిస్ట్రేషన్‌ లెక్క ప్రకారం) ఎకరా లక్ష ఉంటే అందులో రూ. 10వేల ఫీజు రెవెన్యూ అధికారులు వసూలు చేసి అనంతరం లేఅవుట్‌ మంజూరుచేస్తారు. లేఅవుట్‌ ఉంటే సబ్‌ రిజిస్ట్రార్‌ ప్లాట్లను రిజిస్ట్రేషన్‌ చేయాలి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement