ఐటీఐ ఆఫీసర్‌ ఇంటిపై ఏసీబీ దాడులు | acb raids on iti employee house | Sakshi
Sakshi News home page

ఐటీఐ ఆఫీసర్‌ ఇంటిపై ఏసీబీ దాడులు

Published Thu, Dec 28 2017 10:41 AM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM

 acb raids on iti employee house

విజయవాడ : ప్రభుత్వ ఐటీఐలో జిల్లా స్థాయి ట్రైనింగ్ ఆఫీసర్ గా పని చేస్తున్న కోనేరు శ్రీనివాస్ కుమార్ ఇళ్లపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తుల కలిగి ఉన్నారనే ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ విజయవాడ డీఎస్పీ ప్రసాదరావు నేతృత్వంలో సోదాలు జరుపుతున్నారు. విజయవాడతో పాటు పెనమలూరు, కంకిపాడు తదితర ప్రాంతాల్లో ఏక కాలంలో ఆరు చోట్ల సోదాలు జరుపుతున్నారు.

విజయవాడ నగరంలోని గురునానక్ కాలనీ, విజయనగర్ కాలనీల్లోని శ్రీనివాస్ కుమార్ నివాసాల్లో జరిపిన తనిఖీల్లో భారీగా నగదు, బంగారం బయటపడింది. మూడు కార్లు, వాణిజ్య ట్రక్కులను గుర్తించారు. ఇంకా సోదాలు కొనసాగుతున్నాయని డీఎస్పీ ప్రసాదరావు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement