అతనికి పెళ్లైందని తెలిసినా ప్రేమించాను!.. | Love Stories In Telugu : Kiranmayi Happy Ending Love, Guntur | Sakshi
Sakshi News home page

నా కోసం ఆత్మహత్యకు ప్రయత్నించాడు

Dec 28 2019 10:40 AM | Updated on Dec 28 2019 10:58 AM

Love Stories In Telugu : Kiranmayi Happy Ending Love, Guntur - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

తను, నేను ఒక పెళ్లిలో కలిశాము. అతను చాలా మంచి వాడు. నేను అతన్ని కలిసిన మొదటిరోజునే అతని క్యారెక్టర్‌ నన్ను ఆకట్టుకుంది. అతను, మా అన్న బెస్ట్‌ ప్రెండ్స్‌. అతనికి మంచి జాబ్‌ఉంది. లైఫ్‌ను బాగా లీడ్‌ చేస్తున్నాడు. కానీ, అతను ఎప్పుడూ మూడీగా ఉండేవాడు. నేను మొదట్లో అతన్ని పట్టించుకోలేదు. అతను మాత్రం నన్ను బాగా గమనించేవాడు. నేను లైట్‌ తీసుకున్నాను. ఆ పెళ్లిలో నాతో మాట్లాడటానికి చాలా ట్రై చేశాడు. పెళ్లిలో ప్రతిపనీ చేసేవాడు. పెళ్లి అయిపోయాక నాతో మాట్లాడటానికి ఇంటికి కూడా వెళ్లకుండా రాత్రి మొత్తం వేయిట్‌ చేశాడు. అతనికి నేనంటే ఇష్టమని, నాతో మాట్లాడటానికి ట్రై చేస్తున్నాడని నాకప్పుడు ఏమీ తెలియదు.

తర్వాత ఏమనుకున్నాడో ఏమో అక్కడినుంచి వెళ్లిపోయాడు. పెళ్లిలో చాలా తంటాలు పడ్డాడు. ఓ వారం తర్వాత నా మరదలు నా ఫోన్‌ నుంచి అతనికి ఫోన్‌ చేసింది. ఇక అప్పటినుంచి మా పరిచయం చాలా దూరం వెళ్లింది.  అతను తన ప్రొఫెషనల్‌ లైఫ్‌తో చాలా బిజీగా ఉంటాడు. కానీ, నాకోసం ఎక్కువగా టైం కేటాయించేవాడు. నాకు తన ప్రేమ విషయం చెప్పాడు. ఇదివరకే పెళ్లి అయిందని కూడా చెప్పాడు. నాకప్పుడు చాలా బాధవేసింది.

తనకు ఇష్టం లేకుండా పెళ్లి జరిగిందని తెలిసింది. అతను నాతో ఒక్క అబద్ధం కూడా చెప్పలేదు. అతని నిజాయితీ, కేరింగ్‌ నాకు బాగా నచ్చాయి. నన్ను చాలా బాగా చూసుకునేవాడు. నా అవసరాలను ముందుగానే తెలుసుకుని అన్నీ సమకూర్చేవాడు. అతను నన్ను పెళ్లి చేసుకోవాలని వాళ్ల ఇంట్లో వాళ్లందరికి చెప్పాడు. కానీ, వాళ్లు ఒప్పుకోలేదు. ఆ విషయం మా ఇంట్లో వాళ్లకు తెలిసేలా చేశారు. తనతో నా జీవితం ముగిసిపోయిందని అనుకున్నా కానీ, అతన్ని వదులుకోలేకపోయాను. మళ్లీ మాట్లాడుకోవటం మొదలైంది. అందరినీ వదిలేసి నాకోసం వచ్చాడు.

కానీ, నాతో మాట్లాడొద్దని అన్నా. అతను అది తట్టుకోలేకపోయాడు. పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. నాకు కాల్‌ చేసి చనిపోతున్నా అని చెప్పాడు. అతన్ని బ్రతికించుకోవాలని ఉన్నా నేను దూరంగా ఉన్నా. నా మీద నాకు అసహ్యం వేసి చెయ్యి కోసుకున్నా. తర్వాత వాళ్ల ఇంట్లో వాళ్లకు ఫోన్‌ చేసి చెప్పాను. కానీ, నేను లేని జీవితం వద్దని ట్రీట్‌మెంట్‌ చేయించుకోవటానికి మొండికేశాడు..... కొన్ని రోజులకు అతను కోలుకున్నాడు. మళ్లీ మేము హ్యాపీగా లైఫ్‌ లీడ్‌ చేస్తున్నాం.
- కిరణ్మయి


లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement