తిమ్మాజీపేట డిపో నుండి వైన్స్‌లకు మద్యం తీసుకువెళ్తున్న కార్మికులు
తిమ్మాజిపేట(నాగర్ కర్నూల్): కొత్త సంవత్సరం వేడుకలు ‘మత్తు’గానే జరిగినట్లు చెప్పొచ్చు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఉమ్మడి జిల్లాలోని వైన్స్‌లు, బార్లకు సరఫరా అయిన మద్యాన్ని పరిశీలిస్తే ఈ విష యం అర్థమవుతోంది. ఉమ్మడి జిల్లా జిల్లా మొత్తానికి మద్యం సరఫరా చేసే డిపో తిమ్మాజిపేటలో ఉంది. ఇక జిల్లాలో మొ త్తంగా 225 వైన్స్, బార్లు ఉన్నాయి.
వీటి యాజమానులు గత ఏడాది ఇదే సమయంలో 1,94,266 కాటన్ల మద్యం, 1,76,287 కాటన్ల బీరు తీసుకువెళ్లారు. ఈ మద్యం విలువ రూ.95.70 కోట్లు. ఈసారి రూ.121.58 కోట్ల విలువైన 2,36,005 కాటన్ల మద్యం, 3,41,520 కాటన్ల బీర్లు తీసుకువెళ్లారు. అంటే గత ఏడాదితో పోలి స్తే ఉమ్మడి జిల్లాలోని మద్యం ప్రియులు రూ.25.88 కోట్ల మద్యం అదనంగా సంబరాల్లో ఉపయోగించినట్లు!
Comments
Please login to add a commentAdd a comment