వంద కోట్లతో త్రివిక్రమ్ సినిమా..? | 100 crs budget for trivikram suriya movie | Sakshi
Sakshi News home page

వంద కోట్లతో త్రివిక్రమ్ సినిమా..?

Published Fri, Mar 18 2016 12:09 AM | Last Updated on Sun, Sep 3 2017 7:59 PM

వంద కోట్లతో త్రివిక్రమ్ సినిమా..?

వంద కోట్లతో త్రివిక్రమ్ సినిమా..?

సౌత్ సినిమా బిజినెస్ స్థాయి భారీగా పెరగటంతో స్టార్ డైరెక్టర్లందరూ భారీ బడ్జెట్ సినిమాల మీద దృష్టి పెడుతున్నారు. రాజమౌళి లాంటి దర్శకులు ఇప్పటికే తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లగా, ఇప్పుడు మరింత మంది దర్శకులు అదే బాటలో నడవడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే మహేష్ బాబు హీరోగా సౌత్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ ఓ భారీ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా, ఇప్పుడు మరో స్టార్ డైరెక్టర్ వంద కోట్ల సినిమాకు ప్లాన్ చేస్తున్నాడు.

టాలీవుడ్లో స్టార్ హీరోలతో వరుస బ్లాక్ బస్టర్స్ అందించిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, తమిళ స్టార్ హీరో సూర్య హీరోగా భారీ యాక్షన్ సినిమాను తెరకెక్కించనున్నాడు. ఇప్పటి వరకు ఎక్కువగా ఫ్యామిలా డ్రామాలను మాత్రమే తెరకెక్కించిన త్రివిక్రమ్, తొలిసారిగా ఓ యాక్షన్ డ్రామాకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాను తెలుగు తమిళ భాషల్లో ఒకే సారి తెరకెక్కించడానికి రెడీ అవుతున్నారు చిత్రయూనిట్.

ఇప్పటికే 24 సినిమా షూటింగ్ పూర్తి చేసిన సూర్య, సింగం 3లో నటిస్తున్నాడు. త్రివిక్రమ్ కూడా అ.. ఆ.. సినిమాను వీలైనంత త్వరగా పూర్తిచేసి, ఆ తరువాత అల్లు అర్జున్ హీరోగా మరో సినిమాను తెరకెక్కించడానికి రెడీ అవుతున్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తయిన తరువాత సూర్య హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా ప్రారంభమవుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement