దక్షిణాది అవార్డ్‌ల సంబరం
ఆర్థికంగా లాభం కాకపోయినా పరిశ్రమపై ప్రేమతో పదమూడేళ్లుగా ఈ అవార్డు వేడుకలు జరుపుతున్నారు. ఈ దక్షిణాది సినీ అవార్డుల ఫంక్షన్‌కు భారతీయ సినీ దిగ్గజాలు రావడం విశేషం’’ అన్నారు నిర్మాత కె.ఎస్. రామారావు. ఈ నెల 21న హైదరాబాద్‌లో జరగనున్న సినీ వారపత్రిక ‘సంతోషం’ 13వ వార్షికోత్సవం, దక్షిణాది సినీ అవార్డ్స్ సంబరం గురించి ఆయన ఈ వ్యాఖ్య చేశారు.
వేడుకల కర్టెన్ రైజర్ ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో జరిగింది. ఇన్విటేషన్‌ను కేఎస్ రామారావు ఆవిష్కరించగా, వేడుకల సాంగ్ హీరో నాగశౌర్య విడుదల చేశారు. నాయిక రాశీ ఖన్నా, సాయిసుధాకర్, ‘సింధూరపువ్వు’ కృష్ణారెడ్డి, హీరో నాగ అన్వేష్, ‘సంతోషం’ అధినేత సురేశ్ కొండేటి తదితరులు పాల్గొన్నారు.