నా కంటే వాళ్లే పెద్ద స్టార్స్: షారూఖ్‌ | Aamir, Salman are bigger stars than me: SRK | Sakshi
Sakshi News home page

నా కంటే వాళ్లే పెద్ద స్టార్స్: షారూఖ్‌

Published Thu, Jul 7 2016 8:31 PM | Last Updated on Mon, Sep 4 2017 4:20 AM

నా కంటే వాళ్లే పెద్ద స్టార్స్: షారూఖ్‌

నా కంటే వాళ్లే పెద్ద స్టార్స్: షారూఖ్‌

ముంబై: ఆమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్ తనకంటే పెద్ద స్టార్లు అని షారూఖ్ ఖాన్ అన్నాడు. తమ మధ్య మంచి సంబంధాలున్నాయని, పరస్పరం గౌరవించుకుంటామని చెప్పాడు. తన కంటే సల్మాన్, షారూఖ్ పెద్ద స్టార్లు అని ఆమిర్ ఖాన్ చేసిన కామెంట్స్ పై షారూఖ్ స్పందించాడు. 'మా మధ్య మంచి సంబంధాలున్నాయి. మేం ముగ్గురం చాలా ప్రేమగా ఉంటాం. నా కంటే సల్మాన్, ఆమిర్ పెద్ద స్టార్లుగా భావిస్తున్నాను. ఆమిర్ చేసిన కామెంట్స్ మేము పరస్పరం గౌరవించుకుంటామని నిరూపించాయి. మా ముగ్గురిలో ఎవరే సినిమా చేసినా పరస్పరం అభినందించుకుంటామ'ని షారూఖ్ పేర్కొన్నాడు.

ఆమిర్ ఖాన్ తాజా చిత్రం 'దంగల్' పోస్టర్ పై అతడు ప్రశంసలు కురిపించాడు. 'దంగల్' పోస్టర్ అద్భుతంగా ఉందని కితాబిచ్చాడు. 'రాయిస్' సినిమా షూటింగ్ పూర్తైందన్నాడు. ఇంతియాజ్ అలీ, ఆనంద్ ఎల్ రాయ్ సినిమాల్లో నటించనున్నట్టు షారూఖ్ ఖాన్ తెలిపాడు. కాగా, ఆమిర్, షారూఖ్ పశంసలపై సల్మాన్ ఎలా స్పందిస్తాడో చూడాలి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement