
షారూఖ్, పాతికేళ్లలో ఇదే తొలిసారి..!
బాలీవుడ్ అంటే ముందుగా గుర్తొచ్చేది ఖాన్ త్రయం. ప్రస్తుతం బాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ను సల్మాన్, షారూఖ్, ఆమిర్ ఖాన్లు
బాలీవుడ్ అంటే ముందుగా గుర్తొచ్చేది ఖాన్ త్రయం. ప్రస్తుతం బాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ను సల్మాన్, షారూఖ్, ఆమిర్ ఖాన్లు శాసిస్తున్నారు. గతంలో ఈ ముగ్గురు ఖాన్ల మధ్య ఎన్నో వివాదాలు వచ్చాయి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ముగ్గురు ఒకరితో ఒకరు కలిసి మెలసి ఉంటున్నారు. ఒకరి సినిమాలను ఒకరు ప్రమోట్ చేసుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ ఆసక్తికర ట్వీట్ ఒకటి చేశాడు. శుక్రవారం రాత్రి జరిగిన పార్టీలో దిగిన ఓ అరుదైన ఫోటోను ట్వీట్ చేసిన షారూఖ్, ' ఒకరికొకరం పాతికేళ్లుగా తెలిసి తొలిసారిగా ఇద్దరం కలిసి దిగిన ఫోటో ఇదే' అంటూ ట్వీట్ చేశాడు. ఈ ఫోటోలో షారూఖ్తో పాటు ఉన్నది మరెవరో కాదు. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్. షారూఖ్తో పాటు దిగిన ఈ సెల్ఫీ ఫోటోలో ఆమిర్ పోడవాటి గడ్డంతో డిఫరెంట్గా కనిపిస్తున్నాడు.
Known each other for 25 years and this is the first picture we have taken together of ourselves. Was a fun night. pic.twitter.com/7aYKOFll1a
— Shah Rukh Khan (@iamsrk) 10 February 2017