నేను డబ్బు కోసమే పని చేస్తా
నేను డబ్బు కోసమే పని చేస్తా
Published Tue, Feb 11 2014 12:30 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM
‘‘సినిమా తారలు ఎలా ఉన్నా వార్తే. లావుగా ఉంటే సన్నబడాలంటారు. సన్నగా ఉంటే, ‘బరువు పెరగకపోతే కెరీర్ కష్టమే’ అంటారు. ఈ రెండూ కాకుండా మధ్యస్తంగా ఉంటే, ‘ఇలా ఎలా మెయిన్టైన్ అవుతున్నారు. ఆశ్చర్యంగా ఉందే’ అంటారు. మేం ఎలా ఉన్నా ఏదో ఒకటి అనాలని ఫిక్స్ అయిపోతారు’’ అంటున్నారు ఇలియానా. ప్రస్తుతం ఆమె హిందీ చిత్రాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక, దక్షిణాది చిత్రాలు వదులుకున్నట్లేనా? అని ఓ విలేకరి అడిగితే... ‘‘తెలుగు, తమిళ సినిమాలు చేస్తున్నప్పుడు మీకు హిందీలో అవకాశాలు రావడంలేదా? అనడిగేవారు. ఇప్పుడు హిందీలో చేస్తుంటే, తెలుగు సినిమాలు చేయడంలేదేంటి? అనడుగుతున్నారు. ఇలాంటి ప్రశ్నలు విన్నప్పుడు కామెడీగా ఉంటుంది. ఏ భాషలో చేస్తే ఏంటి? అది కూడా సినిమాయే కదా.
పైగా ఆరేళ్ల పాటు స్టార్‌గా నేను ఓ వెలుగు వెలగడానికి కారణమైన తెలుగు సినిమాలకు కావాలని ఎందుకు దూరం అవుతాను. మంచి కథలు వస్తే తప్పకుండా చేస్తాను. సెలబ్రిటీలను ఏదో ఒకటి అడగాలి కాబట్టి.. ఇలాంటివి అడుగుతారనుకుంటా’’ అని చమత్కరించారు. దక్షిణాదిన మంచి పారితోషికం తీసుకున్నారు కదా. ఉత్తరాదిన కూడా బాగానే డిమాండ్ చేస్తున్నారా? అనే ప్రశ్నకు ఇలియానా స్పందిస్తూ -‘‘కొం తమంది తారలు మాకు డబ్బు ముఖ్యం కాదు. మానసిక సంతృప్తి కోసం సినిమాలు చేస్తున్నాం అంటారు. నేనలా అనను. ఎందుకంటే, ఆ మాటలు పూర్తిగా అబద్ధం. కళామతల్లికి సేవ చేస్తున్నాలాంటి పెద్ద పెద్ద మాటలు కూడా మాట్లాడను. చేసే ప్రతి పాత్రకూ డబ్బు తీసుకుంటున్నాను. అది సేవ ఎలా అవుతుంది? నేను డబ్బు కోసమే పని చేస్తా. కానీ, తీసుకున్న పారితోషికా నికి పూర్తి న్యాయం చేస్తా’’ అన్నారు.
Advertisement