‘థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ..’ నిలబెట్టింది | Actor prudhviraj shares his view with sakshi media | Sakshi
Sakshi News home page

‘థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ..’ నిలబెట్టింది

Published Tue, Jun 30 2015 8:52 AM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM

‘థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ..’  నిలబెట్టింది - Sakshi

‘థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ..’ నిలబెట్టింది

పిఠాపురం : ‘థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ. ఊపుంది ఊపేస్తా..’ వంటి డైలాగులే తన కెరీర్‌ను మలుపు తిప్పి, నటుడిగా నిలబెట్టాయని ప్రముఖ సినీ నటుడు పృథ్వీరాజ్ అన్నారు. సోమవారం ఆయన పిఠాపురంలో పాదగయ క్షేత్రాన్ని దర్శించారు. ఆ సందర్భంగా ఆయనతో ‘సాక్షి’ ముచ్చటించింది.

సాక్షి: మీ స్వగ్రామం ఏది?
పృథ్వీరాజ్ :  కాకినాడ సమీపంలోని చొల్లంగి

సాక్షి : మీరు సినీ రంగంలోకి అడుగు పెట్టడానికి కారణమేమిటి?
పృథ్వీరాజ్ :  నేను తాడేపల్లిగూడెంలో ఉండేవాడిని. మాఇంటిపక్కనే సినీ నటుడు రేలంగి ఇల్లు. రోజూ ఆయన మాదిరిగా హాస్య నటుడిగా ఎదగాలని భావించేవాడిని. అదే సినీ రంగ ప్రవేశానికి దోహదపడింది.

సాక్షి : నాటకరంగ పరిచయముందా?
పృథ్వీరాజ్ :  ముందుగా నాటకాలే వేసే వాడిని. ఆ తర్వాతే సినిమా చాన్సు వచ్చింది.

సాక్షి : ఇప్పటి వరకు ఎన్ని సినిమాల్లో నటించారు?
పృథ్వీరాజ్ : 76 సినిమాలలో నటించాను.

సాక్షి : మీకు బ్రేక్ ఇచ్చిన సినిమాలేవి?
పృథ్వీరాజ్ : ‘లౌక్యం’ సినిమా మంచి బ్రేక్ ఇచ్చింది.
 

సాక్షి : ప్రస్తుతం మీరు చేస్తున్న సినిమాలు?

పృథ్వీరాజ్ :  కిక్- 2, గబ్బర్‌సింగ్- 2, కోనవెంకట్ తీస్తున్న ‘శంకరాభరణం’తో పాటు సుమారు పది సినిమాల వరకు నటిస్తున్నాను.

సాక్షి : మీ జీవిత లక్ష్యం ఏమిటి?
పృథ్వీరాజ్ : నటుడిగా పేరు, ప్రఖ్యాతులు సంపాదించాలన్నదే నా జీవితాశయం. పదిమందిని నవ్వించే అవకాశం ఒక్క హాస్య నటులకే ఉంటుంది. ఆ ఆనందం నాకు దక్కింది. ఇంతకంటే నాకు ఏమి కావాలి అన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement