
సాక్షి, విశాఖ : సినీ నటుడు వంకాయల సత్యనారాయణమూర్తి ( 78) సోమవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన శ్వాస సంబంధిత వ్యాధితో బాధ పడుతున్నారు. దాదాపు 180కి పైగా సినిమాల్లో సహాయ నటుడిగా నటించారు. క్యారక్టర్ ఆర్టిస్ట్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న వంకాయల సత్యనారాయణమూర్తి సీతామహాలక్ష్మి, ఊరికిచ్చిన మాట, అర్థాంగి, శుభలేఖ, విజేత వంటి పలు చిత్రాల్లో నటించారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు. కాగా వంకాయల సత్యనారాయణమూర్తి మృతి పట్ల పలువురు నటులు సంతాపం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment