నాపై దుష్ర్పచారం చేస్తున్నారు | Actress Anjali turns year older today? | Sakshi
Sakshi News home page

నాపై దుష్ర్పచారం చేస్తున్నారు

Published Sun, Jul 5 2015 3:34 AM | Last Updated on Wed, Apr 3 2019 9:04 PM

నాపై దుష్ర్పచారం చేస్తున్నారు - Sakshi

నాపై దుష్ర్పచారం చేస్తున్నారు

నాపై కొందరు కావాలనే దుష్ర్పచారం చేస్తున్నారని నటి అంజలి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈమె హైదరాబాద్‌లో షూటింగ్ పెట్టుకోమని చెప్పడం వల్లే మాప్పిళైసింగం చిత్ర నిర్మాణం ఆలస్యం అవుతోందనే ప్రచారం జరుగుతోందట.ఈ విషయమై అంజలి స్పందిస్తూ దేవుని దయవల్ల తన రీఎంట్రీ సంతోషంగా సాగుతోందన్నారు. ఇలాంటి సమయంలో కొందరు కావాలనే సమస్యలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు అని ఆవేదనను వ్యక్తం చేశారు. నిజానికి మాప్పిళైసింగం చిత్రానికి 54 కాల్‌షీట్స్ కేటాయించానన్నారు.

అయితే అందులో సగం వృథా చేశారని ఆరోపించారు.ప్రస్తుతం తాను తెలుగులో నాలుగు చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్నానని తెలిపారు. ఇలాంటి తరుణంలో వచ్చి మాప్పిళైసింగంకు కాల్‌షీట్స్ అదనంగా అడగడంతో తెలుగు నిర్మాతల్ని రిక్వెస్ట్ చేసి హైదరాబాద్‌లో షూటింగ్ పెట్టుకోమనడం కూడా తప్పా? అంటూ ప్రశ్నించారు. అప్పాటక్కర్ చిత్ర పాటల చిత్రీకరణని హైదరాబాద్‌లో చేయమని డిమాండ్ చేసినట్లు అసత్య ప్రచారం చేశారన్నారు.

నిజానికి ఆ చిత్ర పాటల్ని హాంకాంగ్‌లో చిత్రీకరించినట్లు వెల్లడించారు. కాల్‌షీట్స్ సమస్య రాకూడదన్న విషయంలో నేను ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నానన్నారు.ఈ విషయం గురించి హైదరాబాద్‌లో నిర్మాతలెవరిని అడిగినా చెబుతారని అంజలి అన్నారు.మాప్పిళైసింగం చిత్ర నిర్మాణం ఆలస్యానికి కారణాలేమిటో నిర్మాతనే అడిగి తెలుసుకోవాలని అంజలి అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement