Call Sheets
-
నా కోసం చూస్తున్నారు!
జీవితంలో ప్రతి ఒక్కరికీ మంచి కాలం అంటూ ఒకటి వస్తుంది. అయితే దాన్ని సద్వినియోగం చేసుకునే సామర్థ్యం ఉన్న వాళ్లే ఉన్నత స్థాయికి చేరుకుంటారన్న విషయాన్ని పక్కన పెడితే ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాలన్న నానుడి కూడా ఉంది. కానీ నటి తాప్సీ అలాంటిదేమీ పట్టించుకునే పరిస్థితిలో ఉన్నట్లు కనిపించడం లేదు. దక్షిణాదిలో ఆశించిన అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్‌కు మకాం మార్చిన ఈ ఢిల్లీ చిన్నది అక్కడ రెండు మూడు చిత్రాలు విజయం సాధించడంతో వరుసగా అవకాశాలు తలుపు తడుతున్నాయి. దీంతో తాప్సీ మైండ్‌సెట్ మారిపోయింది. తాను అవకాశాల కోసం ఎదురు చూసే కాలం పోయ్యిందని, తన కోసం చిత్ర దర్శక నిర్మాతలు వేచి చూసే టైమ్ నడుస్తోందని అహంతో కూడిన వ్యాఖ్యలు చేస్తోంది. ఇంతకీ తాప్సీ ఏమంటుందో చూద్దాం.. ఈ మధ్య టాలీవుడ్లో ఆనందోబ్రహ్మ అనే చిత్రంలో తానే నటించాలని ఆ చిత్ర దర్శక నిర్మాతలు భావించారని చెప్పింది. అందుకు ఆ చిత్రం తన కాల్షీట్స్ కోసం ఏడాది పాటు వేచి ఉండాల్సి వచ్చింది అని చెప్పింది. అంతే కాదు ఆ చిత్రానికి తన పారితోషికానికి బదులు షేర్ ఇవ్వడానికి రెడీ అన్నారని తెలిపింది. అదే విధంగా ప్రస్తుతం మరో అవకాశం వచ్చిందని, ఆ చిత్రం తన కాల్షీట్స్ కోసం నెల రోజులు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొందని అంది. అందుకు ఆ చిత్ర దర్శక నిర్మాతలు అంగీకరించారని చెప్పింది. అంతే కాకుండా తన కాల్షీట్స్కు తగ్గట్టుగా చిత్ర షూటింగ్‌ను నిర్వహించడానికి హీరోను అంగీకరింపజేశారని తెలిపింది. దీంతో తానా చిత్రంలో నటించడానికి ఒప్పుకున్నానని చెప్పింది. అలా తనకు బదులు వేరే నటిని ఎంపిక చేసుకునే పరిస్థితి మారి తనను మార్చలేనంత స్థాయిలో తాను ఉన్నట్లు పేర్కొంది. -
అందుకు బలమైన కారణమే ఉంటుంది
అదృష్టం ఎవరిని ఎప్పుడు వరిస్తుందో తెలియదు. ఒక సారి ఓడిన వారు మరో సారి గెలవవచ్చు. ఒక భాషలో పక్కన పెట్టిన వారిని మరో భాషలో అందలం ఎక్కించవచ్చు. ఇది నటి రకుల్ప్రీతికి బాగా వర్తిస్తుంది. ఈ బ్యూటీ మొదట తన లక్‌ను తమిళంలో పరిక్షించుకుంది. ఎన్నమో ఏదో వంటి కొన్ని చిత్రాల్లో నటించింది. అయితే కోలీవుడ్‌ను తను అంతగా ఎట్రాక్ట్ చేయలేకపోయిందనే చెప్పాలి. అలాంటి నటి ఇప్పుడు టాలీవుడ్లో క్రేజీ హీరోయిన్ ఒక సమయంలో అక్కడ వద్దంటే అవకాశాలు. కాల్షీట్స్ సర్దుబాటు చేయలేక ఒక పెద్ద స్టార్ చిత్రానే కాదనేసిందట. విశేషం ఏమిటంటే ఆ చిత్రాన్ని ముందు ఒప్పుకుని ఆ తరువాత వైదొలగిందట. ఈ విషయం జరిగి చాలా రోజులు అయినా ఇటీవల ఈ ప్రస్తావన తిరిగి ఈ భామ దృష్టికి తీసుకురాగా నేరుగా బదులివ్వకుండా చిన్న కహానీనే చెప్పుకొచ్చిందట. ఆమె ఏమందో చూద్దాం. నన్ను వెతుక్కుంటూ వచ్చే అవకాశాలన్నీ ఒప్పుకున్నా, లేక నిరాకరించినా అందుకు కారణాలు బలంగానే ఉంటాయి. ఆయా అవకాశాల్లో చాలా వరకు కథ, పాత్ర, దర్శకుడు, హీరో లాంటి అంశాలు ఒకే మాదిరి ఉండడం. ఇకపోతే అన్ని చిత్రాలలోనూ నేనే నటించలేను. ఏడాది 365 రోజులు ఉంటాయి. అన్ని రోజులు మాత్రమే నేను కాల్షీట్స్ కేటాయించగలను. కొన్ని సమయాల్లో కాల్షీట్స్ సర్దుబాటు చేయలేనంటే అందుకు ఏదో ఒక బలమైన కారణం ఉండే ఉంటుంది. అంటూ ముక్కు ఎక్కడుందమ్మా అంటే చేతిని తల చుట్టూ తిపి చూపించినట్లు సమాధానం ఇవ్వడం వయ్యారిభామ రకుల్ప్రీతికే చెల్లిందంటున్నారు సినీ వర్గాలు. -
నేను త్రిష, తమన్న లాగా కాదు
నేను త్రిష, తమన్న లాగా కాదు అని అంటోంది నటి రకుల్‌ప్రీతి సింగ్.మోడలింగ్ రంగం నుంచి వచ్చి సినీ హీరోయిన్గా పాపులర్ అయిన తారల్లో ఈ బ్యూటీ ఒకరు. రకుల్‌ప్రీతి తొలుత ల్యాండ్ అయ్యింది కోలీవుడ్‌లోనే. ఇక్కడ తడయార్ తాక్క,పుత్తగం,ఎన్నమో ఏదో చిత్రాలలో నటించింది. అయితే ఈ చిత్రాలేవి ఈ అమ్మడి కెరీర్‌కు ఉపయోగపడలేదు. దీంతో టాలీవుడ్‌కు మకాం మార్చేసింది. అక్కడ ఈమె దశ తిరిగింది. చిన్న హీరోలతో మొదలెట్టి పెద్ద హీరోల రేంజ్‌కు ఎదిగిపోయింది. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్స్ రామ్‌చరణ్, అల్లు అర్జున్‌లతో నటిస్తోంది. వీటితో పాటు ఏక కాలంలో మహేశ్‌బాబుతో నటించే అవకాశాన్ని కాల్షీట్స్ లేక పోయినా సర్దుబాటు చేసేస్తానంటూ ఒప్పేసుకుంది. అలా అక్కడి ప్రముఖ హీరోయిన్లకు పోటీగా తయారై రాత్రింబవళ్లు ఏకబిగువున నటించేస్తున్న రకుల్ప్రీతికి బాలీవుడ్ అవకాశం వచ్చింది. దీంతో ఎగిరి గంతేసి ఆ చిత్రాన్నీ అంగీకరించింది.పునరాలోచనలో పడితే కాల్షీట్స్ సమస్య తలెత్తింది.అంతే మహేశ్‌బాబు చిత్రానికి టాటా బైబై అనేసింది. ఆ అవకాశాన్ని కాజల్ అగర్వాల్ అందిపుచ్చుకుందనుకోండి.అది వేరే విషయం. రకుల్ప్రీత్రి బాలీవుడ్ దర్శకుడు రమేశ్ సిప్పి దర్శకత్వం వహిస్తున్న సిమ్లా మిర్చి చిత్రంలో నటిస్తోంది. దీంతో రకుల్ప్రీతిని పోటీగా భావించిన ఆ సోకాల్డ్ హీరోయిన్లు కాస్త ఊపిరిపీల్చుకున్నారన్నది వాస్తవం. అయితే టాలీవుడ్లో మాదిరి బాలీవుడ్లో రాణించడం సాధ్యం కాదు. నటి త్రిష, తమన్న, కాజల్ లాంటి వాళ్లు దక్షిణాది నుంచి బాలీవుడ్‌కు వెళ్లి అక్కడ సాధించేద్దాం అని ఉవ్విళ్లూరినవారే. తీరా ఒకటి, రెండు చిత్రాలతో తిరుగు టపా కట్టేశారు. అంటూ రకుల్‌ప్రీతి బాలీవుడ్ రంగప్రవేశంపై మూతి విరుపులు వ్యక్తం చేస్తున్నారట.అయితే తామేమి తక్కువ కాదంటూ రకుల్‌ప్రీతి వర్గం త్రిష, తమన్నల మాదిరి కాదు రకుల్‌ప్రీతి అంటూ టక్కున బదులిస్తున్నారట.ఏదేమయినా రకుల్‌ప్రీతి తొలి హింది చిత్ర రిజల్ట్‌ను బట్టే ఆక్కడ ఆమె భవిష్యత్ ఉంటుంది. -
నాపై దుష్ర్పచారం చేస్తున్నారు
నాపై కొందరు కావాలనే దుష్ర్పచారం చేస్తున్నారని నటి అంజలి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈమె హైదరాబాద్‌లో షూటింగ్ పెట్టుకోమని చెప్పడం వల్లే మాప్పిళైసింగం చిత్ర నిర్మాణం ఆలస్యం అవుతోందనే ప్రచారం జరుగుతోందట.ఈ విషయమై అంజలి స్పందిస్తూ దేవుని దయవల్ల తన రీఎంట్రీ సంతోషంగా సాగుతోందన్నారు. ఇలాంటి సమయంలో కొందరు కావాలనే సమస్యలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు అని ఆవేదనను వ్యక్తం చేశారు. నిజానికి మాప్పిళైసింగం చిత్రానికి 54 కాల్షీట్స్ కేటాయించానన్నారు. అయితే అందులో సగం వృథా చేశారని ఆరోపించారు.ప్రస్తుతం తాను తెలుగులో నాలుగు చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్నానని తెలిపారు. ఇలాంటి తరుణంలో వచ్చి మాప్పిళైసింగంకు కాల్షీట్స్ అదనంగా అడగడంతో తెలుగు నిర్మాతల్ని రిక్వెస్ట్ చేసి హైదరాబాద్‌లో షూటింగ్ పెట్టుకోమనడం కూడా తప్పా? అంటూ ప్రశ్నించారు. అప్పాటక్కర్ చిత్ర పాటల చిత్రీకరణని హైదరాబాద్‌లో చేయమని డిమాండ్ చేసినట్లు అసత్య ప్రచారం చేశారన్నారు. నిజానికి ఆ చిత్ర పాటల్ని హాంకాంగ్‌లో చిత్రీకరించినట్లు వెల్లడించారు. కాల్షీట్స్ సమస్య రాకూడదన్న విషయంలో నేను ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నానన్నారు.ఈ విషయం గురించి హైదరాబాద్‌లో నిర్మాతలెవరిని అడిగినా చెబుతారని అంజలి అన్నారు.మాప్పిళైసింగం చిత్ర నిర్మాణం ఆలస్యానికి కారణాలేమిటో నిర్మాతనే అడిగి తెలుసుకోవాలని అంజలి అంటున్నారు. -
జూబ్లీహిల్స్ పీఎస్‌కు శృతిహాసన్ కేసు...
బంజారాహిల్స్: కాల్షీట్లు ఇచ్చి సరిగ్గా సినిమా షూటింగ్ సమయంలో తనకు కుదరదంటూ మెయిల్‌పట్టి దర్శక, నిర్మాతలను చీటింగ్ చేసిన ఘటనపై నటి శృతిహాసన్పై బంజారాహిల్స్ పోలీసులు నమోదు చేసిన కేసును జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు సోమవారం బదిలీ చేశారు. సినిమా ఒప్పందం, కాల్షీట్ల డేట్లు, అడ్వాన్స్ చెల్లింపులు తదితర ప్రక్రియ అంతా బంజారాహిల్స్ రోడ్ నెం. 2లోని అన్నపూర్ణ స్టూడియోలో జరిగిందని, ఆ స్టూడియో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండటంతో పోలీసులు ఈ కేసును జూబ్లీహిల్స్‌కు బదిలీ చేశారు. ఫైల్‌ను అందుకున్న జూబ్లీహిల్స్ పోలీ సులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. ఇందులో భాగంగా శృతిహాసన్‌కు నోటీసులు జారీ చేయాలని యోచిస్తున్నారు. నేడో రేపో ఆమెకు నోటీసులు జారీ చేసి పోలీస్ స్టేషన్లో హాజరుకావాల్సిందిగా సూచించనున్నారు. ఆమె నుంచి కేసుకు సంబంధించిన వాంగ్మూలం తీసుకోవడానికి పోలీసులు యత్నిస్తున్నారు.