నేను త్రిష, తమన్న లాగా కాదు
నేను త్రిష, తమన్న లాగా కాదు అని అంటోంది నటి రకుల్‌ప్రీతి సింగ్.మోడలింగ్ రంగం నుంచి వచ్చి సినీ హీరోయిన్‌గా పాపులర్ అయిన తారల్లో ఈ బ్యూటీ ఒకరు. రకుల్‌ప్రీతి తొలుత ల్యాండ్ అయ్యింది కోలీవుడ్‌లోనే. ఇక్కడ తడయార్ తాక్క,పుత్తగం,ఎన్నమో ఏదో చిత్రాలలో నటించింది. అయితే ఈ చిత్రాలేవి ఈ అమ్మడి కెరీర్‌కు ఉపయోగపడలేదు. దీంతో టాలీవుడ్‌కు మకాం మార్చేసింది. అక్కడ ఈమె దశ తిరిగింది. చిన్న హీరోలతో మొదలెట్టి పెద్ద హీరోల రేంజ్‌కు ఎదిగిపోయింది. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్స్ రామ్‌చరణ్, అల్లు అర్జున్‌లతో నటిస్తోంది.
వీటితో పాటు ఏక కాలంలో మహేశ్‌బాబుతో నటించే అవకాశాన్ని కాల్‌షీట్స్ లేక పోయినా సర్దుబాటు చేసేస్తానంటూ ఒప్పేసుకుంది. అలా అక్కడి ప్రముఖ హీరోయిన్లకు పోటీగా తయారై రాత్రింబవళ్లు ఏకబిగువున నటించేస్తున్న రకుల్‌ప్రీతికి బాలీవుడ్ అవకాశం వచ్చింది. దీంతో ఎగిరి గంతేసి ఆ చిత్రాన్నీ అంగీకరించింది.పునరాలోచనలో పడితే కాల్‌షీట్స్ సమస్య తలెత్తింది.అంతే మహేశ్‌బాబు చిత్రానికి టాటా బైబై అనేసింది. ఆ అవకాశాన్ని కాజల్ అగర్వాల్ అందిపుచ్చుకుందనుకోండి.అది వేరే విషయం.
రకుల్‌ప్రీత్రి బాలీవుడ్ దర్శకుడు రమేశ్ సిప్పి దర్శకత్వం వహిస్తున్న సిమ్లా మిర్చి చిత్రంలో నటిస్తోంది. దీంతో రకుల్‌ప్రీతిని పోటీగా భావించిన ఆ సోకాల్డ్ హీరోయిన్లు కాస్త ఊపిరిపీల్చుకున్నారన్నది వాస్తవం. అయితే టాలీవుడ్‌లో మాదిరి బాలీవుడ్‌లో రాణించడం సాధ్యం కాదు. నటి త్రిష, తమన్న, కాజల్ లాంటి వాళ్లు దక్షిణాది నుంచి బాలీవుడ్‌కు వెళ్లి అక్కడ సాధించేద్దాం అని ఉవ్విళ్లూరినవారే. తీరా ఒకటి, రెండు చిత్రాలతో తిరుగు టపా కట్టేశారు.
అంటూ రకుల్‌ప్రీతి బాలీవుడ్ రంగప్రవేశంపై మూతి విరుపులు వ్యక్తం చేస్తున్నారట.అయితే తామేమి తక్కువ కాదంటూ రకుల్‌ప్రీతి వర్గం త్రిష, తమన్నల మాదిరి కాదు రకుల్‌ప్రీతి అంటూ టక్కున బదులిస్తున్నారట.ఏదేమయినా రకుల్‌ప్రీతి తొలి హింది చిత్ర రిజల్ట్‌ను బట్టే ఆక్కడ ఆమె భవిష్యత్ ఉంటుంది.