అందుకు బలమైన కారణమే ఉంటుంది | Rakul Preet hikes fee, charges Rs 1.5 crore | Sakshi
Sakshi News home page

అందుకు బలమైన కారణమే ఉంటుంది

Published Sun, Feb 7 2016 3:37 AM | Last Updated on Wed, Apr 3 2019 9:14 PM

అందుకు బలమైన కారణమే ఉంటుంది - Sakshi

అందుకు బలమైన కారణమే ఉంటుంది

అదృష్టం ఎవరిని ఎప్పుడు వరిస్తుందో తెలియదు. ఒక సారి ఓడిన వారు మరో సారి గెలవవచ్చు. ఒక భాషలో పక్కన పెట్టిన వారిని మరో భాషలో అందలం ఎక్కించవచ్చు. ఇది నటి రకుల్‌ప్రీతికి బాగా వర్తిస్తుంది. ఈ బ్యూటీ మొదట తన లక్‌ను తమిళంలో పరిక్షించుకుంది. ఎన్నమో ఏదో వంటి కొన్ని చిత్రాల్లో నటించింది. అయితే కోలీవుడ్‌ను తను అంతగా ఎట్రాక్ట్ చేయలేకపోయిందనే చెప్పాలి. అలాంటి నటి ఇప్పుడు టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్ ఒక సమయంలో అక్కడ వద్దంటే అవకాశాలు. కాల్‌షీట్స్ సర్దుబాటు చేయలేక ఒక పెద్ద స్టార్ చిత్రానే కాదనేసిందట.

విశేషం ఏమిటంటే ఆ చిత్రాన్ని ముందు ఒప్పుకుని ఆ తరువాత వైదొలగిందట. ఈ విషయం జరిగి చాలా రోజులు అయినా ఇటీవల ఈ ప్రస్తావన తిరిగి ఈ భామ దృష్టికి తీసుకురాగా నేరుగా బదులివ్వకుండా చిన్న కహానీనే చెప్పుకొచ్చిందట. ఆమె ఏమందో చూద్దాం. నన్ను వెతుక్కుంటూ వచ్చే అవకాశాలన్నీ ఒప్పుకున్నా, లేక నిరాకరించినా అందుకు కారణాలు బలంగానే ఉంటాయి. ఆయా అవకాశాల్లో చాలా వరకు కథ, పాత్ర, దర్శకుడు, హీరో లాంటి అంశాలు ఒకే మాదిరి ఉండడం.

ఇకపోతే అన్ని చిత్రాలలోనూ నేనే నటించలేను. ఏడాది 365 రోజులు ఉంటాయి. అన్ని రోజులు మాత్రమే నేను కాల్‌షీట్స్ కేటాయించగలను. కొన్ని సమయాల్లో కాల్‌షీట్స్ సర్దుబాటు చేయలేనంటే అందుకు ఏదో ఒక బలమైన కారణం ఉండే ఉంటుంది. అంటూ ముక్కు ఎక్కడుందమ్మా అంటే చేతిని తల చుట్టూ తిపి చూపించినట్లు సమాధానం ఇవ్వడం వయ్యారిభామ రకుల్‌ప్రీతికే చెల్లిందంటున్నారు సినీ వర్గాలు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement