ఈ ఫొటోలో ఉన్నహీరోయిన్ఎవరో తెలుసా..? | Sakshi
Sakshi News home page

ఈ ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో తెలుసా..?

Published Sun, Jul 10 2016 6:30 PM

ఈ ఫొటోలో ఉన్నహీరోయిన్ఎవరో తెలుసా..? - Sakshi

ఈ ఫొటోలో అన్నతో కలసి ఆడుకుంటున్న అందాల చిన్నారిని గుర్తుపట్టారా? ఈ ఫోటో దాదాపు 20 ఏళ్ల క్రితం తీసినది. ఈ అమ్మాయి ఎంత ముద్దుగా, బొద్దుగా ఉందో కదూ. ఆమె ఇప్పుడు దక్షిణాది భాషల్లో ప్రముఖ హీరోయిన్గా వెలిగిపోతోంది.

ఇప్పుడు ఆమె వయసు 24 ఏళ్లు. చిన్నప్పటిలాగే కాస్త బొద్దుగా, అందంగా ఉంటుంది. సిమ్లా ఆపిల్లా మెరిసిపోతుంది. తెలుగులో చాలామంది యువ హీరోల సరసన నటించింది. ఆమే హీరోయిన్ హన్సిక. చిన్నప్పుడు దిగిన ఈ ఫొటోను హన్సిక ట్విట్టర్లో పోస్ట్ చేసింది. హన్సిక మొదటిసారి దేశముదురు సినిమాలో అల్లు అర్జున్ సరసన నటించింది. ఆ తర్వాత తెలుగు, తమిళ సినిమాల్లో చాలా అవకాశాలు వచ్చాయి.

Advertisement
 
Advertisement
 
Advertisement