కాజల్‌ను పక్కన పెట్టారా? | Actress Kajal Aggarwal Set aside in Tollywood? | Sakshi
Sakshi News home page

కాజల్‌ను పక్కన పెట్టారా?

Aug 6 2013 6:56 PM | Updated on Aug 28 2018 4:30 PM

కాజల్‌ను పక్కన పెట్టారా? - Sakshi

కాజల్‌ను పక్కన పెట్టారా?

ప్రేక్షకుల ఆదరణను విశేషంగా చూరగొన్న ఏ హీరోయిన్‌నూ చిత్ర పరిశ్రమ వదులుకోదు.

ప్రేక్షకుల ఆదరణను విశేషంగా చూరగొన్న ఏ హీరోయిన్‌నూ చిత్ర పరిశ్రమ వదులుకోదు. ఒక వేళ పక్కన పెట్టిందంటే అందుకు బలమైన కారణం ఉండే ఉంటుంది. నటి కాజల్ అగర్వాల్ విషయంలో అలాంటి కారణమేమైనా ఉందా? ఆమెను టాలీవుడ్ దూరంగా పెట్టిందా? అనే ప్రశ్నలకు అవుననే బదులొస్తోంది.

వరుసగా హిట్ చిత్రాలలో నటించి అనతి కాలంలోనే తమిళం, తెలుగు భాషలలో ప్రముఖ హీరోయిన్ స్థానానికి చేరుకుంది కాజల్. ఈ అందాల రాశికి టాలీవుడ్‌లో ప్రస్తుతం అవకాశాలు తగ్గాయట. ఇందుకు ఆమె అత్యాశే కారణం అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. తన విజయూలను చూపుతూ పారితోషికాన్ని అమాంతం పెంచేసిందట. తాను కోరినంత పారితోషికం చెల్లిస్తేనే కాల్‌షీట్స్ అని తెగేసి చెప్పడంతో నిర్మాతలు ఆలోచనలో పడుతున్నారట.

ఆ విధంగా ఈ బ్యూటీ తెలుగులో సూపర్‌స్టార్ మహేశ్ బాబు, పవన్ కల్యాణ్ చిత్రాలను చేజార్చుకుందని సమాచారం. ప్రస్తుతం ఈ అమ్మడు తమిళంలో మాత్రమే రెండు చిత్రాలు చేస్తోంది. ఇక్కడా అత్యాశతో ఒక ప్రముఖ హీరో చిత్రం మిస్ అయిందని టాక్. అనవసరంగా పారితోషికం పెంచేసి తొందరపడ్డానా అని పునరాలోచనలో పడిందట ఈ ఉత్తరాది జాణ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement