పెళ్లికూతురాయెనే..
మాంగల్యం తంతునానేనా మమ జీవన హేతునా. ఈ సంప్రదాయ బద్దమయిన ఈ వేదమంత్రాల కోసం యువత ఎదురు చూస్తుంటుంది. అలాంటి ఘడియలు నటి మీరా జాస్మిన్‌కు వచ్చాయి. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం తదితర దక్షిణాది భాషలన్నింటిలోనూ మంచి నటిగా గుర్తింపు పొందిన నటి మీరా జాస్మిన్. ఈమె గురించి ఇంతకు ముందు పలు రకాల వదంతులు ప్రచారం అయ్యాయి. ప్రముఖ సంగీత విద్వాంసుడు మాండోలిన్ శ్రీనివాస్‌తో ప్రేమాయణం అంటూ వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారంటూ రకరకాల ప్రచారం జరిగింది.
ఈమెకు దుబాయ్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అనిల్ జాన్ టైటస్‌తో తిరువనంతపురంలోని పాలయంకోట్టైలో గల ఎల్‌ఎంస్ చర్చిలో వివాహం జరిగింది. మీరాజాస్మిన్ అనిల్ జాన్ టైటస్ సోమవారం రాత్రి 8.30 గంటలకు చట్టబద్ధంగా భార్యాభర్తలయ్యారు. రిజిస్టర్ అధికారి ఒకరు కొచ్చిలోని మీరాజాస్మిన్ ఇంటికి వచ్చి మీరాజాస్మిన్, అనిల్ జాన్ టైటస్‌ల సంతకాలను రిజిస్టర్‌లో పొందుపరిచారు. అదే సమయంలో ఇద్దరు పూలదండలు మార్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ఇరు కుటుంబాలకు చెందిన అతి ముఖ్యమైన వారు మాత్రమే పాల్గొన్నారు. మీరా జాస్మిన్ వివాహానంతరం నటించనున్నారట.