
తమిళనాడు, పెరంబూరు: నటి మీరా మిథన్‌కు మద్రాసు హైకోర్టు నిబంధనలతో కూడిన ముందస్తు బెయిల్‌ను మంజూరు చేసింది. ఫిర్యాదులు, కేసులంటూ అంటూ సంచలన నటిగా మారిన మీరామిథున్‌కు చెన్నై హైకోర్టులో కాస్త ఊరట లభించింది. దీంతో బిగ్‌బాస్ గేమ్‌షో నిర్వాహకులు ఊపిరి పీల్చుకున్నారు. ఎందుకంటే ఈ అమ్మడిప్పుడు బిగ్‌బాస్ హౌస్‌లో ఉంది కాబట్టి. ఇదే బిగ్‌బాస్ రియాలిటీ గేమ్ షో 3లో పాల్గొన్న నటి వనితావిజయకుమార్‌ను ఆ మధ్య తన కూతురు కేసు వ్యవహారంలో తెలంగాణ పోలీసులు, చెన్నై పోలీసులు విచారణకు బిగ్‌బాస్ హౌస్‌లోకి రావడంతో కలకలం రేగింది. అయితే వనితా విజయకుమార్ కూతురు ఆమె వద్దనే ఉంటానని వాగ్మూలం ఇవ్వడంతో వివాదం సమిసిపోయింది. లేకుంటే వనితావిజయకుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేసేవరకూ పరిస్థితి వెళ్లేది. అలాంటి పరిస్థితి నటి మీరా మిథున్ విషయంలోనూ తలెత్తింది. బిగ్‌బాస్ హౌస్‌లో వివాద సభ్యురాలిగా ముద్రపడిన ఈమెపై పోలీస్‌స్టేషన్‌లో నమోదైంది.
నటి మీరా మిథున్ అందాల పోటీలను నిర్వహిస్తున్నట్లు చెప్పి తన వద్ద తీసుకున్న రూ.50 వేలను తిరిగి చెల్లించకుండా మోసం చేసిందంటూ రంజిత్ బండారి అనే వ్యక్తి స్థానిక తేనంపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో మీరా మిథున్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు ఆమెను అరెస్ట్ చేయడానికి రంగాన్ని సిద్ధం చేశారు. దీంతో నటి మీరా మిథన్ ముందస్తు బెయిల్ కోసం చెన్నైహైకోర్టును ఆశ్రయించింది. ఆమె కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో తనపై తప్పుడు కేసు పెట్టారని, ప్రస్తుతం తాను బిగ్‌బాస్ రియాలిటీ గేమ్ షోలో పాల్గొంటున్నానని పేర్కొంది. బయటకు రాగానే పోలీసుల విచారణకు పూర్తిగా సహకరిస్తానరి, తనపై కేసును చట్టబద్ధంగా ఎదుర్కొంటానని తెలిపింది. తనను పోలీసులు అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్‌ను మంజూరు చేయాల్సిందిగా కోరింది. నటి మీరామిథున్ కోరికను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం రూ.50 వేలు కోర్టులో జమ చేయాలని, విచారణ అధికారి సమక్షంలో సంతకం చేయాలి వంటి షరతులతో కూడిన ముందుస్త బెయిల్‌ను మంజూరు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment