చెన్నై ,పెరంబూరు: 8 తూట్టాగళ్ చిత్రంలో కథానాయకిగా పరిచయం అయిన నటి మీరామిథున్. దక్షిణ భారతీయ అందాల పోటీల్లో కిరీటాన్ని గెలుచుకుని ఈ అమ్మడు ఇటీవల సొంతంగా అందాల పోటీలను నిర్వహించ తలపెట్టి వివాదాల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. తాజాగా మరో మోసం కేసును ఎదుర్కొంటోంది. స్థానిక టీ.నగర్, ప్రకాశం వీధికి చెందిన రంజిత్ భద్రాశ్రీ అనే వ్యక్తి నటి మీరామిథున్‌పై పాండిబజార్ పోలీస్ స్టేషన్‌లో పిర్యాదు చేశాడు. అందులో.. తాను పూలదండల వ్యాపారం చేసుకుంటున్నానని, తనకు 2018లో నటి మీరామిథున్ పరిచయం అయ్యిందని పేర్కొన్నారు. తాను మిస్ దక్షిణాది అందాల పోటీలో కిరీటాన్ని గెలుచుకున్నానని, త్వరలో సొంతంగా అందాల పోటీలను నిర్వహించనున్నట్లు చెప్పిందన్నారు.
దానికి డిజైనింగ్ కాంట్రాక్ట్‌ను తనకు ఇస్తానని చెప్పి అడ్వాన్స్‌గా రూ.50 వేలు తీసుకుందన్నారు. అయితే ఆమె డిజైనింగ్ కాంట్రాక్ట్ ను తను ఇవ్వలేదని, తను నుంచి తీసుకున్న రూ.50 వేలు తిరిగి చెల్లించకుండా మోసం చేసిందని పేర్కొన్నారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నటి మీరామిథున్‌ను విచా రించడానికి సిద్ధం అయ్యారు. కాగా నటి మీరామిథున్ బిగ్‌బాస్ రియాలిటీ గేమ్ షోలో పాల్గొనడంతో ఆమెను విచారించడానికి బిగ్‌బాస్ హౌస్‌లోకి ప్రవేశించే విషయమై చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. ఇప్పటికే నటి వనితావిజయకుమార్ వ్యవహారంలో ఒకసారి పోలీసులు బిగ్‌బాస్ హౌ స్‌లోకి వెళ్లడం కలకలానికి దారి తీసిన విషయం తెలిసిందే. తాజాగా నటి మీరా మిథున్ కేసు వ్యవహారం మరోసారి కలకలానికి దారి తీస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment