బీజేపీలో చేరిన బిల్లా ఫేమ్‌ | Actress Namitha joins BJP | Sakshi
Sakshi News home page

బీజేపీలో చేరిన నటి నమిత

Published Sat, Nov 30 2019 7:15 PM | Last Updated on Sat, Nov 30 2019 7:16 PM

Actress Namitha joins BJP - Sakshi

సాక్షి, చెన్నై: ప్రముఖ నటి నమిత బీజేపీలో చేరారు. బీజేపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జేపీ నడ్డా సమక్షంలో శనివారం ఆమె పార్టీ కండువా కప్పుకున్నారు. ఆమెతో పాటు మరింత కొంత మంది కూడా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కాగా నమిత దక్షిణాదిన పలు భాషల్లో నటించిన విషయం తెలిసిందే. తెలుగులో కూడా ఆమె పలు సినిమాల్లో నటించారు. జెమిని, బిల్లా, సింహా వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించారు. గతకొంత కాలంగా సినిమాల్లో అవకాశం లేకపోవడంతో రాజకీయాల వైపు అడుగులు వేసింది. తమిళనాడులో బీజేపీ తరఫున రానున్న అసెం‍బ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగే అవకాశం కూడా ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement