అందాల ఆరబోతకు ప్రణీత రెడీ | actress pranitha act's in mass movies | Sakshi
Sakshi News home page

అందాల ఆరబోతకు ప్రణీత రెడీ

Published Sat, May 2 2015 2:50 AM | Last Updated on Wed, Apr 3 2019 9:13 PM

అందాల ఆరబోతకు ప్రణీత రెడీ - Sakshi

అందాల ఆరబోతకు ప్రణీత రెడీ

ఎవరు అవునన్నా, కాదన్నా ప్రస్తుత పరిస్థితుల్లో సినిమాకు గ్లామర్‌తో పాటు డ్యూయెట్స్ అవసరమే. చిత్ర కథలో ఎంత దమ్ము ఉన్నా యువతను అలరించేదిపై రెండు విషయాలే. అందుకే దర్శక నిర్మాతలు కథకు అవసరం లేకపోయినా గ్లామర్‌ను క్రియేట్ చేసి మరీ చిత్రాల్లో జొప్పిస్తుంటారు. అసలు విషయానికొస్తే దర్శకుడు వెంకట్‌ప్రభు కూడా మాస్ చిత్రంలో గ్లామర్ కోసమే ఒక హీరోయిన్ పాత్రను సృష్టించారనే టాక్ వినిపిస్తోంది. సూర్య ద్విపాత్రాభినయం చేస్తున్న చిత్రం మాస్. ఇందులో ఒక సూర్య సరసన నటి నయనతార నటించారు. మరో సూర్య కోసం తొలుత ఎమిజాక్సన్‌ను ఎంపికచేశారు.

అయితే ఆ చిత్రంలో తనకు ప్రాముఖ్యత లేదంటూ ఆమె వైదొలిగారు. దీంతో నటి ప్రణీతను ఎమిజాక్సన్ పాత్రకు ఎంపిక చేశారు. అయితే ఈ చిత్రం కోసం నయనతార పాటల సన్నివేశాల్లో మినహా ఎలాంటి సన్నివేశంలోనూ గ్లామరస్‌గా నటించేది లేదని ఖరాఖండిగా చెప్పారట. దీంతో అందాలారబోత కోసమే నటి ప్రణీతను వాడుకున్నారని సమాచారం.తెలుగులో అత్తారింటికి దారేది చిత్రంలో నటించినా ఆ చిత్ర దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తదుపరి చిత్రంలో అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది.

అది ప్రణీత స్వయం కృతాపరాధమేననే ప్రచా రం జరిగింది. దీంతో అక్కడ అవకాశాలు లేవు. సరిగ్గా అలాంటి సమయంలో సూర్య కు జంటగా మాస్ చిత్రంలో నటించే అవకాశం రావడంతో  ఒకే చెప్పారని సమాచారం. పెద్ద హీరో చిత్రం కావడంతో మళ్లీ కోలీవుడ్‌లో అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చుననే ఆరాటంతోనే ప్రణీత మాస్‌లో నటించడానికి సమ్మతించినట్టు సమాచారం.  ఆమె అందాలు మాస్ చిత్రానికి ఆకర్షణగా నిలుస్తాయని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement