
నటి సుహాసిని మణిరత్నం
సాక్షి, చెన్నై: ప్రముఖ నటి సుహాసిని మణిరత్నం ఆయన ఒత్తిడి కారణంగానే నేను పెళ్లి చేసుకున్నానని అన్నారు. దివంగత దర్శక దిగ్గజం కే.బాలచందర్ 88వ జయంతిని సోమవారం ఆయన కూతురు పుష్పాకందసామి, కుటుంబ సభ్యులు స్థానిక సాలిగ్రామంలోని గోల్డెన్ ప్యారడైజ్ మండపంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నటుడు నాజర్, సుహాసిని, కరుపళనీయప్పన్, వసంత్, పూర్ణిమాభాగ్యరాజ్ సినీ ప్రరముఖులు పాల్గొని కే.బాలచందర్ చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించారు.
నటి సుహాసినీ మాట్లాడుతూ.. దర్శకుడంటే అది బాలచందర్‌నేనని పేర్కొన్నారు. తమ విజయ సోపానాలన్నింటికీ ఆయనే కారణం అని అన్నారు. తన చెల్లెలికి వివాహం చేస్తున్న సమయంలో తననూ పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేసింది ఆయనేనని తెలిపారు. ఆయన చెప్పడంతోనే తాను పెళ్లి చేసుకున్నానని సుహాసిని అన్నారు. సంగీత దర్శకుడు ఇళయరాజా అభినందించిన ఏకైక దర్శకుడు కే.బాలచందరినేనని దర్శకుడు కరుపళనీయప్పన్ అన్నారు. ఆయనతో ఎక్కువగా పని చేసే భాగ్యం తనకు లభించకపోయినా, పని చేసిన వారి కంటే ఎక్కువగా కే.బాలచందర్ గురించి మాట్లాడుతున్నామని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment