
నటి అదా శర్మ తన ఫిట్‌నెస్‌తో అందరినీ ఆశ్చపరిచారు. ఇటీవల ఓ మేగజైన్ కోసం ఆమె ఫొటో షూట్ చేశారు. అందుకు సంబంధించిన ఫొటోలను ట్విటర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. వాటికి నెటిజన్ల నుంచి భారీ స్పందన లభించింది. అంత అందమైన శరీరాకృతిని ఎలా సాధించారు? అంటూ ఆమెను పలువురు అడిగారు. ఇందుకు స్పందించిన అదా శుక్రవారం ఓ వీడియోను ట్విటర్‌లో పోస్టు చేశారు.
తాడుతో కసరత్తులు చేసిన ఆమె రాత్రంతా ఇలా వేలాడుతూ నిద్రపోతే 8 ప్యాక్స్ ఉచితంగా వస్తాయని చెప్పారు. అయితే, తాడును బ్యాలెన్స్ చేయాలంటే అందుకు తగ్గ శక్తి, స్థిరత్వం మన శరీరానికి ఉండాలని పేర్కొన్నారు. అంతేగాక ఆమె అభిమానలకు అంతర్జాతీయ మల్లకంభ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జిమ్నాస్ట్‌లు స్తంభం లేదా తాడుని పట్టుకుని తలకిందులుగా వేలాడుతూ చేసే కసరత్తులను మల్లకంభ అంటారు.
You have all been asking me how I got the bikini body...So here...All you have to do is sleep like this (all night 😋) and 8 pack abs free free free ! On a serious note balancing on the rope calls for a lot of stability and core strength
— Adah Sharma (@adah_sharma) June 15, 2018
Today is International Mallakhambh day! pic.twitter.com/ZT8bm1zWIZ
Comments
Please login to add a commentAdd a comment