మళ్లీ రెడ్డిగారి అమ్మాయిగా!
రెడ్డిగారి అమ్మాయిగా అదాశర్మ నటన, క్యారెక్టర్ కోసం కష్టపడిన తీరు చూసి సెకండ్ సీక్వెల్‌లో ఆమెనే హీరోయిన్‌గా తీసుకోవాలనుకున్నారు నిర్మాత విపుల్ అమృత్‌లాల్ షా. తెలుగమ్మాయి భావనా రెడ్డిగా అదాశర్మ నటించిన హిందీ సినిమా ‘కమాండో–2’. ఇప్పుడీ సినిమాకు సీక్వెల్ తీస్తున్నారు. తెలుగులో అదా శర్మ ఐదు సినిమాలు చేశారు. అప్పుడెప్పుడూ సీరియస్‌గా తెలుగు నేర్చుకునే ప్రయత్నం చేయలేదు.
భావనా రెడ్డి క్యారెక్టర్ కోసం కష్టపడి కాస్త తెలుగు నేర్చుకున్నారు. అందుకే, మళ్లీ ఆమెను హీరోయిన్‌గా తీసుకున్నారట! ఓ సౌత్ సూపర్‌హిట్ సినిమాను బేస్ చేసుకుని ‘కమాండో–3’ రాస్తున్నారట! ‘ఊసరవెల్లి, తుపాకీ’ తదితర సినిమాల్లో విలన్‌గా నటించిన విద్యుత్ జమాల్ ఇందులో హీరో. ‘కమాండో’, ‘కమాండో–2’ సినిమాల్లోనూ ఆయనే హీరో.