Commando -2
-
మళ్లీ రెడ్డిగారి అమ్మాయిగా!
రెడ్డిగారి అమ్మాయిగా అదాశర్మ నటన, క్యారెక్టర్ కోసం కష్టపడిన తీరు చూసి సెకండ్ సీక్వెల్లో ఆమెనే హీరోయిన్గా తీసుకోవాలనుకున్నారు నిర్మాత విపుల్ అమృత్లాల్ షా. తెలుగమ్మాయి భావనా రెడ్డిగా అదాశర్మ నటించిన హిందీ సినిమా ‘కమాండో–2’. ఇప్పుడీ సినిమాకు సీక్వెల్ తీస్తున్నారు. తెలుగులో అదా శర్మ ఐదు సినిమాలు చేశారు. అప్పుడెప్పుడూ సీరియస్‌గా తెలుగు నేర్చుకునే ప్రయత్నం చేయలేదు. భావనా రెడ్డి క్యారెక్టర్ కోసం కష్టపడి కాస్త తెలుగు నేర్చుకున్నారు. అందుకే, మళ్లీ ఆమెను హీరోయిన్గా తీసుకున్నారట! ఓ సౌత్ సూపర్‌హిట్ సినిమాను బేస్ చేసుకుని ‘కమాండో–3’ రాస్తున్నారట! ‘ఊసరవెల్లి, తుపాకీ’ తదితర సినిమాల్లో విలన్‌గా నటించిన విద్యుత్ జమాల్ ఇందులో హీరో. ‘కమాండో’, ‘కమాండో–2’ సినిమాల్లోనూ ఆయనే హీరో. -
ఉగాది ఎప్పుడూ తీపి గుర్తే
తీపి, చేదు, పులుపు, వగరు, ఉప్పు, కారం... షడ్రుచుల సమ్మేళనం మనిషి జీవితం. దీనికి ప్రతీక తెలుగు సంవత్సరాది.. ఉగాది. గతేడాది ఉగాదికి నేను హైదరాబాద్‌లో ఉన్నాను. పండక్కి నెల రోజుల ముందే ‘క్షణం’ వంటి సూపర్‌హిట్‌ను తెలుగు ప్రేక్షకులు నాకు బహుమతిగా ఇచ్చారు. నా సంతోషాన్ని ఇక్కడివాళ్లతో కలసి పంచుకున్నా. ఈ నెలలో విడుదలైన హిందీ సినిమా ‘కమాండో–2’ మంచి విజయం సాధించింది. అందులో నేను తెలుగమ్మాయి భావనారెడ్డిగా నటించా. దాంతో ఈ సంతోషాన్నీ తెలుగు ప్రేక్షకులతో పంచుకోవాలని హైదరాబాద్ వచ్చేశా. కథానాయికగా నా ప్రయాణంలో షడ్రుచులున్నాయి. కానీ, నాకు ఎక్కువ పేరు తీసుకొచ్చింది, తీపి గుర్తులు అందించిందీ తెలుగు చిత్ర పరిశ్రమే. అందువల్ల, నేనెప్పుడో తెలుగింటి అమ్మాయిని అయిపోయా. తెలుగు ప్రజలు ఎంతో ఇష్టంగా జరుపుకునే ఉగాది అంటే నాకూ ఇష్టమే. ఈ పండక్కి ‘ఐఫా ఉత్సవమ్’లో నేను సంప్రదాయ వస్త్రాధారణలో హాజరవుతున్నా. ఈ వేడుక కోసం మా అమ్మ చీరను కట్టుకుంటున్నా.