
అదితీ రావ్ హైదరీ (ఫైల్ ఫొటో)
నటిగా మంచి మార్కులు కొట్టేశారు అదితీ రావ్ హైదరీ. నటిగా కంటే డ్యాన్సర్‌గా ఇంకో రెండు మార్కులు ఆమె ఎక్కువే వస్తాయి. డాక్టర్ కావాలనుకున్న తాను యాక్టర్ అయ్యానంటూ తరచుగా చెప్పుకునే అదితీ ఓ తెలుగమ్మాయి. ఆమె పూర్వీకులు వనపర్తి సంస్థానాదీశులన్న విషయం తెలిసిందే. హైదరాబాద్‌లో పుట్టిన అదితీ.. ఢిల్లీ పెరిగారు. ఇండస్ట్రీలో తనకంటూ గ్రాండ్ ఫాదర్స్ లేరని, అయినా సొంత టాలెంట్‌ను నమ్ముకుని విజయాలు సాధిస్తున్నానని తెలిపారు. ఇండస్ట్రీలో మా ఫ్యామిలీ నుంచి ఎవరూ లేకున్నా.. ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదని, తోటి నటీనటులు తనను ఎంతగానో గౌరవిస్తున్నారని చెప్పారు.
ఇతరుల జోలికి వెళ్లకుండా, నా పని చేసుకుంటూ మంచి నటిగా గుర్తింపు తెచ్చుకోవాలని చూస్తానన్నారు. ఎవరైనా నా జోలికి రావాలనుకుంటే అది కేవలం అవతలి వ్యక్తుల సమస్యే కానీ నాకు ఏ ఇబ్బంది ఉండదని స్పష్టం చేశారు హైదరీ. 'నాకు డ్రాయింగ్ వేయడం, సంగీతం, డ్యాన్స్ చాలా ఇష్టం. ఇవన్నీ కలగలిపితే నటన అని నేను నమ్ముతున్నా. మా అమ్మమ్మ నుంచి ప్రేరణ పొందాను. ఆమె ఇచ్చిన స్వేచ్ఛవల్లే నేను ఈ స్థాయికి చేరుకున్నానంటూ' హీరోయిన్ అదితీ రావ్ హైదరీ వివరించారు. లండన్, న్యూయార్క్, వజీర్ అండ్ భూమి, దాస్ దేవ్ చిత్రాల్లో నటించారు.
Comments
Please login to add a commentAdd a comment