మరో మలయాళ రీమేక్‌లో కమల్
విశ్వనటుడు కమలహాసన్ మరో మలయాళ చిత్ర రీమేక్‌లో నటించడానికి రెడీ అవుతున్నారన్నది తాజా సమాచారం. మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ నటించిన తాజా చిత్రం ఒప్పం. సముద్రకని, అనుశ్రీ, విమలారామన్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి ప్రియదర్శన్ దర్శకుడు. ఇందులో మోహన్‌లాల్ అందుడి పాత్రలో నటించారు.ఇటీవల ఓనం పండగ సందర్భగా విడుదలైన ఈ చిత్ర విశేష ప్రేక్షకాదరణతో ప్రదర్శింపబడుతోంది.
ముఖ్యంగా అంధుడిగా మోహన్‌లాల్ నటనను విమర్శకులు సైతం ప్రశంసిస్తున్నారు. ఈ చిత్రం హిందీతో సహా ఇతర దక్షిణాది భాషల్లో పునర్నిర్మాణానికి రంగం సిద్ధమవుతోందని సమాచారం. ఈ చిత్రాన్ని ఇటీవల సూపర్‌స్టార్ ప్రత్యేక ప్రదర్శనలో తిలకించారు. ఆ తరువాత విశ్వనటుడు కమలహాసన్ చూశారు. ఇప్పుడీయన తమిళ వెర్షన్‌లో నటించడానికి సిద్ధమవుతున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం.
ఇంతకు ముందు మోహన్‌లాల్ మలయాళంలో నటించిన దృశ్యం చిత్రం ఇతర అన్ని భాషల్లోనూ రీమేక్ అయి మంచి విజయాన్ని సాధించింద న్నది గమనార్హం.దృశ్యం తమిళ రీమేక్‌లోనూ కమల్ నటించి సూపర్‌హిట్ సాధించారు. ప్రస్తుతం కమల్ శభాష్‌నాయుడు చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఇది తమిళం, తెలుగు, తమిళం బాషల్లో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఒప్పం తమిళ రీమేక్ షూటింగ్ డిసెంబర్‌లో గానీ, జనవరిలో గానీ ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. కమల్ ఇంతకు ముందు అమావాస్య చంద్రుడు చిత్రంలో అంధుడిగా నటించారన్నది గమనార్హం.