
సాక్షి, న్యూఢిల్లీ: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ 2017 ఫోర్బ్స్ ఇండియా సెలబ్రిట్ 100 జాబితాలో వరుసగా రెండో ఏడాదీ టాప్ ప్లేస్‌లో నిలిచాడు. 2016లో ఇదే జాబితాలో షారూక్ ఖాన్‌ను తోసిపుచ్చుతూ నెంబర్ వన్ పొజిషన్‌లోకి సల్మాన్ దూసుకువచ్చాడు. సల్మాన్ ఖాన్ వార్షిక రాబడి 232.83 కోట్లుగా ఫోర్బ్స్ లెక్కగట్టింది. రూ 170 కోట్లతో షారూక్ ఖాన్ ఈ జాబితాలో రెండో స్ధానంలో నిలిచాడు.
టీమిండియా కెప్టెన్, కొత్తగా పెళ్లిపీటలెక్కిన విరాట్ కోహ్లి రూ 100.72 కోట్లతో టాప్ 3గా నిలిచాడు. కోహ్లీ భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మ రూ 28 కోట్ల వార్షికాదాయంతో టాప్ 100 సెలబ్రిటీ జాబితాలో 32వ స్ధానం దక్కించుకుంది.
ఇక అక్షయ్ కుమార్ నాలుగో స్దానంలో వీరి తర్వాత వరుసగా సచిన్ టెండూల్కర్, అమీర్ ఖాన్, ప్రియాంచ చోప్రా, ధోని, హృతిక్ రోషన్, రణ్‌వీర్ సింగ్‌లు టాప్ 10లో స్ధానం సంపాదించుకున్నారు. కాగా గత ఏడాది ఈ జాబితాలో టాప్ 3 ముగ్గురి రాబడి రూ 626 కోట్ల నుంచి ఈ ఏడాది రూ 504 కోట్లకు తగ్గడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment