అజయ్‌క్రిష్ణ హీరోగా కట్టం పోట్ట సట్ట | ajaya krishna act to kattam potta satta movie | Sakshi
Sakshi News home page

అజయ్‌క్రిష్ణ హీరోగా కట్టం పోట్ట సట్ట

Published Fri, Feb 5 2016 3:56 AM | Last Updated on Fri, Aug 17 2018 2:27 PM

అజయ్‌క్రిష్ణ హీరోగా   కట్టం పోట్ట సట్ట - Sakshi

అజయ్‌క్రిష్ణ హీరోగా కట్టం పోట్ట సట్ట

నాడోడిగళ్ చిత్రంలో చిన్న పాత్రతో నటనకు శీకారం చుట్టిన నటుడు అజయ్‌క్రిష్ణ. చిన్న పాత్రతోనే చిన్న చిన్న గ్రామాల వరకూ రీచ్ అయిన ఈయన ఆ మధ్య విడుదలైన ధరణి చిత్రంలో కథానాయకుడిగా తన స్థాయిని మరింత పెంచుకున్నారు. తాజాగా కట్టంపోట్టసట్ట అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. ఇందులో ఆయనకు జంటగా పిశాచు చిత్రం ఫ్రేమ్ ప్రియాంక నటిస్తున్నారు. వైట్ పికాక్ ప్రొడక్షన్ పతాకంపై ఎస్.శరవణన్ నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా నవ దర్శకుడు అక్షయప్రియన్ పరిచయం అవుతున్నారు.

ఈయన దర్శకుడు అగస్త్యిన్ శిష్యుడన్నది గమనార్హం. ఇసైజ్ఞాని ఇళయరాజా సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సిలంబాట్టం చిత్ర దర్శకుడు శరవణన్ చాయాగ్రహణం అందించడం విశేషం. చిత్రం వివరాలను దర్శకుడు తెలుపుతూ దక్షిణాది జిల్లాల ప్రజల జీవన విధానాన్ని అందంగా ఆవిష్కరించే చిత్రం కట్టం పోట్ట సట్ట అని తెలిపారు. ఈ చిత్రం కోసం అళగర్‌మలై, అడివారం సమీపంలో ఒక గ్రామ సెట్‌నే వేసి చిత్రీకరిస్తున్నట్లు వెల్లడించారు. చిత్రం షూటింగ్ తుది దశకు చేరుకుందని దర్శకుడు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement