
రిపబ్లిక్‌డేకి అజిత్ చిత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్
నటుడు అజిత్ చిత్రం వచ్చి చాలా కాలమైంది. దీంతో ఆయన తాజా చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అజిత్ ప్రస్తుతం తన 57వ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇంతకు ముందు వీరం, వేదాళం చిత్రాలను తెరకెక్కించిన శివన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అజిత్, శివ కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సత్యజ్యోతి ఫిలింస్ సంస్థ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రంలో అజిత్ సరసన నటి కాజల్ అగార్వాల్ నటిస్తున్నారు. చిత్రం షూటింగ్ బల్గేరియాలో అధిక భాగం జరుపుకుంది.
ఇప్పటికి 75 శాతం చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ చిత్రంలో అజిత్ ఇంటర్‌పోల్ అధికారిగా నటిస్తున్నట్లు తెలిసింది. అయితే చిత్రానికి సంబంధించిన ఎలాంటి ఫొటోలు ఇప్పటి వరకూ అధికారికపూర్వంగా వెలువడలేదు. ఇందులో అజిత్ గెటప్ గురించి, చిత్ర వివరాల గురించి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా వారికో గుడ్ న్యూస్ ఏమిటంటే ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను గణతంత్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేయాలని చిత్ర వర్గాలు నిర్ణయించినట్లు తాజా సమాచారం.