
ఆయన సిన్సియర్.. ఈయన హార్డ్‌వర్కర్: హీరోయిన్
నటుడు అజిత్ చాలా సిన్సియర్ అని నటి కాజల్ అగర్వాల్ అన్నారు. ఇక విజయ్ గురించి ప్రశ్నించగా ఆయన హార్డ్‌వర్కర్ అని చెప్పారు.
చెన్నై: నటుడు అజిత్ చాలా సిన్సియర్ అని నటి కాజల్ అగర్వాల్ అన్నారు. ఇక విజయ్ గురించి ప్రశ్నించగా ఆయన హార్డ్‌వర్కర్ అని చెప్పారు. నేటి క్రేజీ హీరోయిన్లలో కాజల్‌అగర్వాల్ ఒకరు. తమిళంలో ఇద్దరు ప్రముఖ హీరోలతో ఏక కాలంలో ఆమె నటిస్తున్నారు. ఆమె నటించిన రెండు చిత్రాలు తెరపైకి రానున్నాయి. ఒకటి అజిత్‌తో కలిసి నటించిన వివేగం కాగా టాలీవుడ్ యువ నటుడు రానాతో నటించిన నేనేరాజా నేనే మంత్రి మరొకటి. వీటితోపాటు ఇళయదళపతి విజయ్ సరసన నటిస్తున్న మెర్శల్ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి.
దీంతో చాలా బిజీగా ఉన్న కాజల్‌ను పలకరించగా ఈ ఏడాది తన టైం చాలా బాగుందని ఖుషీ అయ్యారు. కోలీవుడ్‌లో అజిత్, విజయ్‌తో ఏక కాలంలో నటించడం సంతోషంగా ఉందనీ, అజిత్‌తో తొలిసారిగా నటించాననీ చెప్పారు. ఆయన నటనలో చాలా సిన్సియర్ అని, మంచి వ్యక్తిత్వం కలిగిన నటుడుని పేర్కొన్నారు. అజిత్‌లాంటి ఫ్యాబులస్ యాక్టర్‌తో కలిసి నటించడం మంచి అనుభవం అన్నారు. వివేగం చిత్రానికి సంబంధించి వన్ లైన్ స్టోరీ దర్శకుడు చెప్పగానే తాను ప్లాట్ అయ్యానన్నారు.
ఇందులో తానింత వరకూ నటించనటువంటి పాత్రను పోషించానన్నారు. వివేగం చిత్ర కథ చాలా కొత్తగా ఉంటుందని తెలిపారు. అనిరుథ్ చాలా మంచి సంగీతాన్నిచ్చారని చెప్పారు. ఈ చిత్రాన్ని ప్రేక్షకుల మధ్య కూర్చుని చూడాలని ఆశ పడుతున్నట్లు తెలిపారు. విజయ్‌తో తాను ఇప్పటికే రెండు చిత్రాలలో నటించాననీ, ఆయన ఎనర్జీ సూపర్ అని, లవబుల్ పర్సన్ అని, అంతకు మించి హర్డ్‌వర్కర్ అని పొగడ్తల్లో ముంచెత్తారు.