అఖిల్, హను సినిమా ఆగిపోలేదా..? | Akhil, Hanu Ragavapudi film on cards | Sakshi
Sakshi News home page

అఖిల్, హను సినిమా ఆగిపోలేదా..?

Sep 28 2016 12:17 PM | Updated on Jul 15 2019 9:21 PM

అఖిల్, హను సినిమా ఆగిపోలేదా..? - Sakshi

అఖిల్, హను సినిమా ఆగిపోలేదా..?

తొలి సినిమాతో నిరాశపరిచిన స్టార్ వారసుడు అక్కినేని అఖిల్, రెండో సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇప్పటికే చాలా కథలు విన్న అఖిల్, ఒకటి, రెండు సినిమాలను దాదాపు...

తొలి సినిమాతో నిరాశపరిచిన స్టార్ వారసుడు అక్కినేని అఖిల్, రెండో సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇప్పటికే చాలా కథలు విన్న అఖిల్, ఒకటి, రెండు సినిమాలను దాదాపు ఫైనల్ చేసిన తరువాత పక్కన పెట్టేశాడు. హను రాఘవపూడి సినిమాను అధికారికంగా ప్రకటించి కూడా పక్కన పెట్టేశాడు.

ఇటీవల అఖిల్ నెక్ట్స్ సినిమా మనం ఫేం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఉంటుందంటూ నాగార్జున ప్రకటించాడు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. అయితే తాజాగా మరో ఆసక్తికరమైన వార్త అక్కినేని అభిమానులను ఖుషి చేస్తోంది.

ఆగిపోయిందనుకున్న అఖిల్, హను రాఘవపూడి ప్రాజెక్ట్ కూడా త్వరలోనే సెట్స్ మీదకు  రానుందన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతానికి అఖిల్, విక్రమ్ కుమార్తో, హను, నితిన్తో సినిమాలు చేస్తున్నారు. ఈ రెండు సినిమాలు పూర్తయిన తరువాత ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా ప్రారంభం కానుందన్న టాక్ బలంగా వినిపిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement