
కింగ్ నాగార్జున హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం మన్మథుడు 2. చిలసౌ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాను వయాకామ్ 18 స్టూడియోస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్‌తో కలిసి అన్నపూర్ణ స్టూడియోస్, మనం ఎంటర్‌ప్రైజెస్ బ్యానర్‌లపై నాగార్జున స్వయంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.
టీజర్‌లో నాగార్జున రెండు డిఫరెంట్ షేడ్స్‌లో కనిపిస్తున్నాడు. ఏజ్ బార్ అయినా పెళ్లి కానీ వ్యక్తిగా, అమ్మాయిలతో సరదాగా గడిపే ప్లేబాయ్‌గా రెండు షేడ్స్‌లో అలరించాడు నాగ్. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో సమంత, కీర్తి సురేష్‌లు అతిథి పాత్రల్లో నటిస్తున్నారు. వెన్నెల కిశోర్, లక్ష్మీ, రావూ రమేష్, ఝాన్సీ, దేవదర్శిని ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు చైతన్య భరద్వాజ్ సంగీతమందిస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment