‘రోబో-2’లో అక్షయ్ విలనా? | Akshay Kumar plays the villain in 'Robot 2' | Sakshi
Sakshi News home page

‘రోబో-2’లో అక్షయ్ విలనా?

Published Thu, Dec 17 2015 11:09 PM | Last Updated on Sun, Sep 3 2017 2:09 PM

‘రోబో-2’లో అక్షయ్ విలనా?

‘రోబో-2’లో అక్షయ్ విలనా?

రజనీకాంత్-శంకర్ కాంబినేషన్‌లో ‘రోబో’ సీక్వెల్ ఇటీవలే చెన్నైలో ప్రారంభమైంది. 400 కోట్ల రూపాయలతో లైకా ప్రొడక్షన్స్ సుభాష్ కరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రం  ‘2.0’. త్రీడీ ఎఫెక్ట్‌తో పాటు ఎన్నో ప్రత్యేకతలతో రూపొందుతున్న ఈ చిత్రంలో హిందీ నటుడు అక్షయ్‌కుమార్ కీలక పాత్ర పోషించడం ఓ విశేషం. అయితే, ఇందులో అక్షయ్ విలన్‌గా చేస్తున్నారనే చెన్నై సమాచారం. ఇందులో ఎమీ జాక్సన్ కథానాయిక. ‘జురాసిక్ పార్క్’, ‘ఐరన్ మేన్’, ‘ఎవెంజర్స్’ వంటి హాలీవుడ్ చిత్రాలకు విజువల్ ఎఫెక్ట్స్ చేసిన యానిమాట్రిక్స్ సంస్థ దీనికి పని చేస్తోంది. ఈ చిత్రానికి సంగీతం: ఎ.ఆర్. రహమాన్, కెమెరా: నిరవ్ షా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement