
యస్.. కౌంట్‌డౌన్ స్టార్టయ్యింది.. బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్‌కు. ఎందుకంటే లేడీ డైరెక్టర్ మేఘనా గుల్జార్ దర్శకత్వంలో నటించిన ‘రాజీ’ సినిమాను 2018 మే 11న రిలీజ్ చేయనున్నట్లు ఆలియా భట్ పేర్కొన్నారు. తొలిసారి ఆలియా లేడీ డైరెక్టర్‌తో చేసిన సినిమా ‘డియర్ జిందగీ’. దీనికి గౌరీ షిండే దర్శకురాలు. ఇప్పుడు ‘రాజీ’తో మరోసారి మహిళా దర్శకురాలితో సినిమా చేయడం ఆనందంగా ఉందంటున్నారు. 1971 ఇండో–పాక్ వార్ టైమ్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా సాగుతుంది.
ఇందులో ఆలియా భట్ కాశ్మీరీ అమ్మాయి క్యారెక్టర్‌లో నటించారు. అంతేకాదు.. ఈ సినిమాలో దేశం కోసం ఇష్టం లేని పెళ్లి చేసుకుని ఆలియా ‘స్పై’గా వర్క్ చేస్తారన్నది బాలీవుడ్ సమాచారం. ‘‘సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యింది. చాలా రోజులుగా ఒకే క్యారెక్టర్‌లో నటిస్తున్నప్పుడు బయటికి రావడం అంత ఈజీ కాదు. కానీ, తప్పదు. సినిమా కోసం చాలా కష్టపడ్డాం. మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాం’’ అని షూట్ కంప్లీట్ అయిన సందర్భంగా ఆలియా పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment