‘అల్లరి’కి భయం లేదు! | allari naresh new movie Intlodeyyam .. nakembhayam | Sakshi
Sakshi News home page

‘అల్లరి’కి భయం లేదు!

Published Fri, Oct 14 2016 11:37 PM | Last Updated on Mon, Sep 4 2017 5:12 PM

‘అల్లరి’కి భయం లేదు!

‘అల్లరి’కి భయం లేదు!

‘సీమశాస్త్రి’, ‘సీమ టపాకాయ్’ చిత్రాల తర్వాత ‘అల్లరి’ నరేశ్, జి.నాగేశ్వరరెడ్డి కాంబినేషన్‌లో తెరకెక్కిన వినోదాత్మక చిత్రం ‘ఇంట్లో దెయ్యం.. నాకేం భయం’. కృతిక, మౌర్యాని కథానాయికలు. శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర ఎల్‌ఎల్‌పీ పతాకంపై బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. నిర్మాత మాట్లాడుతూ- ‘‘అత్తారింటికి దారేది’, ‘నాన్నకు ప్రేమతో’ చిత్రాల తర్వాత మా బ్యానర్లో వస్తోన్న పూర్తి స్థాయి ఎంటర్‌టైనర్ ఇది. వినోదంతో పాటు హారర్ ఉంటుంది.

బ్యాంకాక్‌లో  తీసిన పాటలతో షూటింగ్ కంప్లీట్ అయ్యింది. నవంబర్ 11న సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం. మా బ్యానర్లో మరో సూపర్‌హిట్ మూవీ అవుతుంది’’ అని అన్నారు. ‘‘నరేశ్, నా కాంబినేషన్‌లో గతంలో వచ్చిన చిత్రాలు హిట్ అయ్యాయి. ఆ చిత్రాల కంటే ఈ సినిమా విజయవంతమై, మాకు హ్యాట్రిక్ సక్సెస్ సాధించి పెడుతుందనే హోప్ ఉంది’’ అని దర్శకుడు పేర్కొన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: భోగవల్లి బాపినీడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement