
టాలీవుడ్ సైలీష్ స్టార్ అల్లు అర్జున్ సినిమాలతో ఎంత బిజీగా ఉన్న ఫ్యామిలీ లైఫ్‌కు తగిన ప్రాధాన్యత ఇస్తాడన్న విషయం తెలిసిందే. సెలవులు, పండుగలను కుటుంబ సభ్యులతో గడపడంమంటే బన్నీకి ఎంతో సరదా. వాటికి సంబంధించిన ఫోటోలు, వీడియాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటాడు. తాజాగా బన్నీ షేర్ చేసిన వీడియా నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది.
ఈ వీడియోలో తాను చెప్పినట్లుగా కూతురుతో అనిపిస్తున్నాడు బన్నీ. నేను నాన్న చెప్పిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటానని కూతురుతో అనిపిస్తున్నాడు. నేను నాన్న చెప్పిన అబ్బాయిని వరకు అన్న ఆ చిన్నారి.. చేసుకోనంటూ ముద్దుగా పలుకుతుంది. చూడ్డానికి చాలా క్యూట్ గా ఉన్న వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇక ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న బన్నీ త్వరలో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాలో బన్నీ డిఫరెంట్ లుక్‌లో కనిపించనున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment