శ్రీ విష్ణు, నివేదా థామస్ కాంబినేషన్‌లో వచ్చిన బ్రోచేవారెవరురా చిత్రం మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. ఆకట్టుకునే కథనాలతో, వినోదభరితంగా తెరకెక్కించిన ఈ చిత్రం సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ప్రేక్షకులు మెచ్చిన ఈ చిత్రాన్ని సెలబ్రెటీలు సైతం మెచ్చుకుంటున్నారు. సినీ ప్రముఖుల నుంచి ఈ చిత్రానికి ప్రశంసలు లభిస్తున్నాయి.
తాజాగా ఈ చిత్రాన్ని వీక్షించిన స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా ప్రశంసుల కురిపించారు. ‘బ్రోచేవారెవరురా చిత్రాన్ని చూశాను. చివరి వరకు థ్రిల్లింగా ఉండటంతో పాటు వినోదభరితంగా ఉంది. ఈ సినిమాకు పనిచేసిన సాంకేతిక నిపుణులందరికీ కంగ్రాట్స్. శ్రీ విష్ణు మంచి చిత్రాలు చేయడానికి ప్రయత్నిస్తుంటాడు’ అని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌కు .. ‘బన్నీ థాంక్యూ వెరీ మచ్’ అంటూ నివేదా థామస్ బదులిచ్చింది. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతాన్ని అందించారు.
Comments
Please login to add a commentAdd a comment