సాధారణ మహిళగా ఉండలేను | Amala paul Want To Social Service In Chennai | Sakshi
Sakshi News home page

సాధారణ మహిళగా ఉండలేను

Published Wed, Aug 15 2018 9:26 AM | Last Updated on Wed, Aug 15 2018 9:26 AM

Amala paul Want To Social Service In Chennai - Sakshi

తమిళసినిమా: ఒక సాధారణ మహిళగా ఉండటం నా వల్ల కాదు అంటోంది నటి అమలాపాల్‌. ప్రేమ, పెళ్లి, విడాకులు  అన్నీ వెంట వెంటనే ఎదుర్కొన్న ఈ సంచలన నటి హీరోయిన్‌గా మాత్రం కేరీర్‌ను కొనసాగిస్తూనే ఉంది. అయితే మునుపంత దూకుడు లేదు. గ్లామరస్‌ ఫొటోలను ఇంటర్నెట్‌లో పోస్ట్‌ చేయడం లాంటి ఏదో ఒక విధంగా వార్తల్లో ఉండే ప్రయత్నం చేస్తున్న అమలాపాల్‌ తాను చాలా మందిలా సాధారణ అమ్మాయిలా ఉండలేను అంటూ మరోసారి వార్తలకెక్కింది. ఇంతకీ ఈ జాన ఏమంటుందో చూద్దాం. నటి అన్నాక గ్లామర్‌ పాత్రలనే కాకుండా అన్ని రకాల పాత్రలను చేయాలి. అమ్మగా నటించడానికి కూడా నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అయితే మీడియా వాళ్లే దీని గురించి చర్చ చేస్తున్నారు.

కొచ్చి, చెన్నై ఈ రెండు నాకు పుట్టిల్లు లాంటివే. కొచ్చి పుట్టిన ఊరు అయితే చెన్నై ఉద్యోగం చేస్తున్న ఊరు కొచ్చికి వెళితే అమ్మకు గారాలబిడ్డనైపోతాను. బాగా నిద్రపోతాను. బాగా తింటాను. ఎక్సర్‌సైజు చేస్తాను. చెన్నైలో ఉంటే అలా ఉండలేను. కారణం ఇది జీవితాన్నిచ్చిన ఊరు. అందుకే కాస్త భయంగా ఉండాలి. నాకు సినిమా మినహా వేరేం తెలియదు. అయితే తొలిసారిగా ఏదైనా వ్యాపారం చేయాలన్న ఆలోచన వచ్చింది. ఆయుర్వేదానికి సంబంధించిన వృత్తిలో దృష్టి సారిద్దాం అని అనుకుంటున్నాను. దీంతో పాటు స్నేహితులతో కలిసి ఒక సామాజిక సేవా సంస్థను ఏర్పాటు చేయాలనుకుంటున్నాను. తద్వారా 100 మందికి నేత్ర చికిత్స చేయించాలనే పథకం ఉంది. అంతేగాకుండా మనసులో ఆలోచనలను కథల రూపంలో పేపర్‌పై పెడుతున్నాను. అయితే ఒక్కటి మాత్రం దృఢంగా చెప్పగలను అమలాపాల్‌ అందరిలా సాధారణ మహిళలా ఉండలేదు అని అంది. ప్రస్తుతం ఈ బ్యూటీ కోలీవుడ్, మాలీవుడ్‌లతో ఒక్కో చిత్రం చేస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement