Free eye medical camp
-
సాధారణ మహిళగా ఉండలేను
తమిళసినిమా: ఒక సాధారణ మహిళగా ఉండటం నా వల్ల కాదు అంటోంది నటి అమలాపాల్. ప్రేమ, పెళ్లి, విడాకులు అన్నీ వెంట వెంటనే ఎదుర్కొన్న ఈ సంచలన నటి హీరోయిన్గా మాత్రం కేరీర్‌ను కొనసాగిస్తూనే ఉంది. అయితే మునుపంత దూకుడు లేదు. గ్లామరస్ ఫొటోలను ఇంటర్నెట్లో పోస్ట్ చేయడం లాంటి ఏదో ఒక విధంగా వార్తల్లో ఉండే ప్రయత్నం చేస్తున్న అమలాపాల్ తాను చాలా మందిలా సాధారణ అమ్మాయిలా ఉండలేను అంటూ మరోసారి వార్తలకెక్కింది. ఇంతకీ ఈ జాన ఏమంటుందో చూద్దాం. నటి అన్నాక గ్లామర్ పాత్రలనే కాకుండా అన్ని రకాల పాత్రలను చేయాలి. అమ్మగా నటించడానికి కూడా నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అయితే మీడియా వాళ్లే దీని గురించి చర్చ చేస్తున్నారు. కొచ్చి, చెన్నై ఈ రెండు నాకు పుట్టిల్లు లాంటివే. కొచ్చి పుట్టిన ఊరు అయితే చెన్నై ఉద్యోగం చేస్తున్న ఊరు కొచ్చికి వెళితే అమ్మకు గారాలబిడ్డనైపోతాను. బాగా నిద్రపోతాను. బాగా తింటాను. ఎక్సర్సైజు చేస్తాను. చెన్నైలో ఉంటే అలా ఉండలేను. కారణం ఇది జీవితాన్నిచ్చిన ఊరు. అందుకే కాస్త భయంగా ఉండాలి. నాకు సినిమా మినహా వేరేం తెలియదు. అయితే తొలిసారిగా ఏదైనా వ్యాపారం చేయాలన్న ఆలోచన వచ్చింది. ఆయుర్వేదానికి సంబంధించిన వృత్తిలో దృష్టి సారిద్దాం అని అనుకుంటున్నాను. దీంతో పాటు స్నేహితులతో కలిసి ఒక సామాజిక సేవా సంస్థను ఏర్పాటు చేయాలనుకుంటున్నాను. తద్వారా 100 మందికి నేత్ర చికిత్స చేయించాలనే పథకం ఉంది. అంతేగాకుండా మనసులో ఆలోచనలను కథల రూపంలో పేపర్‌పై పెడుతున్నాను. అయితే ఒక్కటి మాత్రం దృఢంగా చెప్పగలను అమలాపాల్ అందరిలా సాధారణ మహిళలా ఉండలేదు అని అంది. ప్రస్తుతం ఈ బ్యూటీ కోలీవుడ్, మాలీవుడ్లతో ఒక్కో చిత్రం చేస్తోంది. -
నయనంపై నజర్
బూర్గంపాడు: కంటి సంబంధిత రుగ్మతలను దూరం చేసేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. చూపు మందగించడంతో పాటు ఇతర కంటి రుగ్మతల నివారణకు ఉచితంగా వైద్యసేవలను అందించేందుకు జిల్లా వైద్యారోగ్యశాఖ కసరత్తు ప్రారంభించింది. మూడునెలల పాటు అన్ని గ్రామ పంచాయతీలలో కంటి వైద్య శిబిరాల నిర్వహణకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. పిల్లలు, పెద్దలందరికీ ఈ వైద్య శిబిరాలలో కంటి పరీక్షలు నిర్వహించనున్నారు. జిల్లాలో 12 వైద్య బృందాలతో కంటి వైద్య శిబిరాలను నిర్వహించేందుకు జిల్లా వైద్యారోగ్యశాఖ చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఆయా బృందాలకు శిక్షణ నిస్తున్నారు. హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్ వైద్య విజ్ఞాన సంస్థ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇక్కడ శిక్షణ పొందిన వారు క్షేత్రస్థాయిలో ఏఎన్ఎంలకు, ఆశ కార్యకర్తలకు అవగాహన కల్పిస్తారు. ఒక్కో బృందంలోముగ్గురు ఆప్తాల్మిక్ అధికారులు, అయా పీహెచ్‌సీల పరిధిలోని వైద్యులు, సిబ్బంది, ఆశ వర్కర్లు, ఏఎన్ఎంలు ఉంటారు. మూడునెలల పాటు శిబిరాలు... వైద్య బృందాలు మూడు నెలల పాటు జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీలలో ప్రజలకు కంటి వైద్య పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. వారానికి ఐదు రోజులు ఈ క్యాంపుల నిర్వహణ సాగుతుంది. కంటి వైద్య శిబిరాలను విజయవంతం చేసేందుకు స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజాసంఘాలు, స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకుంటారు. వైద్య శిబిరాల నిర్వహణ ఏర్పాట్ల బాధ్యతను అయా గ్రామ పంచాయతీలకే అప్పగించాలని అధికారులు భావిస్తున్నారు. ఈ శిబిరాలకు అవసరమైన మెడికల్ కిట్లను సాధ్యమైనంత త్వరగా అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్ వైద్య, విజ్ఞాన కేంద్రం వారు కంటి వైద్య శిబిరాలకు అవసరమైన 6000 కిట్లను ప్రభుత్వానికి అందించేందుకు సిద్ధం చేశారు. అన్నీ సక్రమంగా జరిగితే ఈ నెల 25 నుంచే కంటి వైద్యశిబిరాలను జిల్లాలో ప్రారంభించేందుకు అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. ఇళ్ల వద్దనే వైద్యపరీక్షలు... ఐదు దశల్లో కంటి వైద్యపరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆశ వర్కర్లు, ఏఎన్ఎంలు ముందుగా గ్రామాల్లో ఇళ్లకు వెళ్లి ప్రభుత్వం అందించే ప్రత్యేకమైన కిట్ల సాయంతో దృష్టి లోపం ఉన్నవారిని గుర్తిస్తారు. లోపం ఉన్న వారిని శిబిరం నిర్వహించే రోజు కంటి వైద్యనిపుణల వద్దకు తీసుకొస్తారు. అక్కడవారికి ప్రత్యేకమైన యంత్రాలతో పరీక్షలు నిర్వహిస్తారు. దృష్టి లోపం ఉన్నవారికి శిబిరంలోనే ఉచితంగా కళ్లజోళ్లు అందిస్తారు. కంటి శుక్లాలు, కాటరాక్ట్, గ్లూకోమా వంటి లోపాలున్న వారిని శస్త్ర చికిత్సల కోసం రిఫర్ చేస్తారు. జఠిలమైన సమస్యలుంటే హైదరాబాద్‌కు తరలించి ఉచితంగా చికిత్స చేస్తారు. ఈ వ్యవహారం మొత్తం జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి పర్యవేక్షణలో జరుగుతుంది. -
ఈ–‘ఐ’తో గ్రామీణులకు ఉచితకంటి వైద్యపరీక్షలు
పూతలపట్టు : ముఖ్యమంత్రి ఈ–‘ఐ’ ద్వారా గ్రామీణ ప్రజలకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహిస్తామని డీఎం అండ్ హెచ్ఓ విజయగౌరి తెలిపారు. గురువారం మండలంలోని పి.కొత్తకోట సీహెచ్‌సీలో ముఖ్యమంత్రి ఈ–ఐ కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. ఈ కేంద్రంలో ప్రజలకు ఉచిత కంటి వైద్య పరీక్షలు చేసి... ఆ ఇమేజ్ను చెన్నై అపోలో హాస్పిటల్‌కు మెయిల్ చేస్తామని చెప్పారు. అక్కడ కంటివైద్యులు పరిశీలిస్తారని, అవసరమైన వారికి ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయిస్తామని తెలిపారు. కళ్లజోడు అవసరమైతే 20 సంవత్సరాలలోపు యువకులకు ఏడాదికి 2 జతలు, ఆపైన వయసు ఉన్నవారికి ఏడాది ఒక జత అందిస్తామని చెప్పారు. జిల్లాలో గురువారం 115 సెంటర్లు ప్రారంభించామని తెలిపారు. ఆపరేషన్ థియేటర్లో సౌకర్యాలపై అసంతృప్తి సీహెచ్‌సీ ఆవరణను డీఎం అండ్ హెచ్ఓ తనిఖీ చేశారు. ఆఫీసు గదిలో దుమ్ము, దూళి ఉండడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఆపరేషన్ ధియేటర్ను పరిశీలించారు. మందులు, ఆపరేషన్ కిట్లు తనిఖీచేసి వైద్యసిబ్బందిపై అసహనం వ్యక్తం చేశారు. గర్భవతుల పరీక్షలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కాన్పుల సమయంలో జాగ్రత్తలు వహించి నాణ్యమైన మందులు తగిన సౌకర్యాలు కల్పించాలన్నారు. కాలం చెల్లిన మందులు ఉపయోగించరాద ని, ఎప్పుటికప్పుడు మందులు, ఇంజెక్షన్లు తనిఖీ చేయాలని డాక్టర్లకు సూచించారు. డాక్టర్లు శ్రీనివాసులు, ప్రసాద్ రెడ్డి, లీల, జోత్స్న, కంటి టెక్నీషియన్ ధర్మారెడ్డి, ఏఎన్ఎంలు పాల్గొన్నారు. -
449 మందికి ఉచిత కంటి వైద్యం
జిన్నారం: మండల కేంద్రం జిన్నారంలోని ప్రభుత్వ గిరిజన బాలుర గురుకుల పాఠశాలలో సోమవారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. గడ్డపోతారం పారిశ్రామికవాడలోని హెటిరో పరిశ్రమ ఆధ్వర్యంలో సికింద్రాబాద్‌లోని పుష్పగిరి కంటి ఆస్పత్రికి చెందిన వైద్యులు పాఠశాలలోని 449 మందిని పరీక్షించారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు అందించారు. త్వరలోనే కళ్లజోళ్లు అందించేలా చర్యలు తీసుకుంటామని నిర్వాహకుడు ప్రతాప్‌రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ వీరప్రభాకర్, వైస్ ప్రిన్సిపల్ వెంకటయ్య, ఆస్పత్రి కో-ఆర్డినేటర్ శ్రావణ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.