449 మందికి ఉచిత కంటి వైద్యం
జిన్నారం: మండల కేంద్రం జిన్నారంలోని ప్రభుత్వ గిరిజన బాలుర గురుకుల పాఠశాలలో సోమవారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. గడ్డపోతారం పారిశ్రామికవాడలోని హెటిరో పరిశ్రమ ఆధ్వర్యంలో సికింద్రాబాద్‌లోని పుష్పగిరి కంటి ఆస్పత్రికి చెందిన వైద్యులు పాఠశాలలోని 449 మందిని పరీక్షించారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు అందించారు.
త్వరలోనే కళ్లజోళ్లు అందించేలా చర్యలు తీసుకుంటామని నిర్వాహకుడు ప్రతాప్‌రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ వీరప్రభాకర్, వైస్ ప్రిన్సిపల్ వెంకటయ్య, ఆస్పత్రి కో-ఆర్డినేటర్ శ్రావణ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.