ఇ–ఐ కేంద్రాన్ని తనిఖీ చేస్తున్న డీఎం అండ్ హెచ్‌ఓ విజయగౌరి
పూతలపట్టు : ముఖ్యమంత్రి ఈ–‘ఐ’ ద్వారా గ్రామీణ ప్రజలకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహిస్తామని డీఎం అండ్ హెచ్‌ఓ విజయగౌరి తెలిపారు. గురువారం మండలంలోని పి.కొత్తకోట సీహెచ్‌సీలో ముఖ్యమంత్రి ఈ–ఐ కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. ఈ కేంద్రంలో ప్రజలకు ఉచిత కంటి వైద్య పరీక్షలు చేసి... ఆ ఇమేజ్‌ను చెన్నై అపోలో హాస్పిటల్‌కు మెయిల్ చేస్తామని చెప్పారు. అక్కడ కంటివైద్యులు పరిశీలిస్తారని, అవసరమైన వారికి ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయిస్తామని తెలిపారు. కళ్లజోడు అవసరమైతే 20 సంవత్సరాలలోపు యువకులకు ఏడాదికి 2 జతలు, ఆపైన వయసు ఉన్నవారికి ఏడాది ఒక జత అందిస్తామని చెప్పారు. జిల్లాలో గురువారం 115 సెంటర్లు ప్రారంభించామని తెలిపారు.
ఆపరేషన్ థియేటర్‌లో సౌకర్యాలపై అసంతృప్తి
సీహెచ్‌సీ ఆవరణను డీఎం అండ్ హెచ్‌ఓ తనిఖీ చేశారు. ఆఫీసు గదిలో దుమ్ము, దూళి ఉండడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఆపరేషన్ ధియేటర్‌ను పరిశీలించారు. మందులు, ఆపరేషన్ కిట్లు తనిఖీచేసి వైద్యసిబ్బందిపై అసహనం వ్యక్తం చేశారు. గర్భవతుల పరీక్షలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కాన్పుల సమయంలో జాగ్రత్తలు వహించి నాణ్యమైన మందులు తగిన సౌకర్యాలు కల్పించాలన్నారు. కాలం చెల్లిన మందులు ఉపయోగించరాద ని, ఎప్పుటికప్పుడు మందులు, ఇంజెక్షన్లు తనిఖీ చేయాలని డాక్టర్లకు సూచించారు. డాక్టర్లు శ్రీనివాసులు, ప్రసాద్ రెడ్డి, లీల, జోత్స్న, కంటి టెక్నీషియన్ ధర్మారెడ్డి, ఏఎన్‌ఎంలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment